భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన భాగస్వామి ధనశ్రీ వర్మతో విడాకుల పుకార్ల మధ్య.. మరో ఫోస్ట్ చేశాడు. గురువారం (ఫిబ్రవరి 20) ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సీక్రెట్ పోస్ట్‌ను పంచుకున్నాడు. ఈ పోస్ట్‌లో చాహల్ తనకు వచ్చిన క్లిష్ట పరిస్థితుల నుండి రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు.
భారత్ మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, యూజీ తన ఖాతా నుంచి ధనశ్రీ ఫొటోలను తొలగించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. చహల్, ధనశ్రీ �