ఏపీలో ఇంకా ఎన్నికల మూడ్ రాకుండానే పొత్తుపొడుపులు ప్రారంభం అయ్యాయి. వైసీపీని ఓడించేందుకు ఇతర పార్టీలు కలిసి రావాలని ఈమధ్యే మాజీ సీఎం చంద్రబాబు వాకృచ్చారు. చంద్రబాబు కామెంట్లపై మండిపడ్డారు వైసీపీ నేతలు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సొంత పార్టీపై నమ్మకం లేదు. ప్రతీ ఎన్నికల సమయంలో అందుకే ఇతర పార్టీలతో చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటారన్నారు బాలినేని. పొత్తుల కోసం వెంపర్లాడుతున్నప్పుడే సీఎం జగన్ ఎదుర్కొనలేక పోతున్నారని…
విశాఖలో జరిగిన వైసీపీ సమన్వయ కమిటీ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తల ధైర్యం సీఎం జగన్మోహన్రెడ్డేనని స్పష్టం చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలోని పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విశాఖలో వైసీపీ జెండా ఎగరేస్తామని.. విశాఖను తమ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని ఆమె వివరించారు. గతంలో విశాఖ ఎలా ఉందో. ఇప్పుడు విశాఖ…
విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో వైఎస్ఆర్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మంత్రి విడదల రజనీ, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సహా వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2014 నుంచి…
చంద్రబాబు హయాం అంతా బ్రోకర్ల మయం.. ఇప్పుడు ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదంటూ వ్యాఖ్యానించారు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు… శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ ప్రభుత్వం నయాపైసా లంచం లేకుండా లబ్ధిదారులకు నేడు సంక్షేమం అందిస్తుందన్నారు. బ్రోకర్ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని గుర్తుచేశారు.. అయితే, చంద్రబాబు హయాంలో అంతా బ్రోకర్ల మయం చేశారని.. అవినితిపరుల మయం అయ్యిందన్నారు. నాడు తాయాలాలు చెల్లించడంతో పాటు, ఇంటి మీద…
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రాజకీయ పొత్తుల గురించి చర్చ సాగుతోంది.. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరితో పొత్తులు అవసరం లేదని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. భయపడే వాళ్లే పొత్తులు గురించి ఆలోచిస్తారన్న ఆయన.. చంద్రబాబుని ప్రజలు నమ్మరన్నారు.. అంతే కాదు, చంద్రబాబుకు అతని మీద అతనికే విశ్వాసం లేదని సెటైర్లు వేశారు. గుంటూరులో జాబ్ మేళాను ప్రారంభించిన విజయసాయిరెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మరో 25 సంవత్సరాలు వైసీపీదే అధికారమని ధీమా వ్యక్తం…
ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బాదుడే బాదుడు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాల్లో పర్యటించిన ఆయన.. జిల్లాల పర్యటనకు వచ్చిన ప్రజా స్పందన అద్భుతం అంటూ ట్వీట్ చేశారు. 7 జిల్లాలలోని 21 నియోజకవర్గాల్లో లక్షల మందికి చేరువగా పర్యటన సాగిందన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడుపై ప్రజల అభిప్రాయాలు, అవేదన, ఆగ్రహం రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేకతను చాటాయని.. ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో…
ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శలు గుప్పించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయమైన రైతులకు ఉచిత విద్యుత్ పథకానికి తనయుడు జగన్ రెడ్డి మంగళం పలికేందుకు సిద్ధమయ్యారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Read Also: Yadadri Temple: యాదాద్రిలో మళ్లీ మరమత్తులు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు రూ.1000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. రైతులు బిల్లులు చెల్లించాక, తదుపరి…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొరిగే కుక్క కరవద అని.. చంద్రబాబు పరిస్థితి కూడా అంతేనని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు పాఠం చెప్పారని.. వచ్చే 25 ఏళ్ళు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి…
ఏపీలో నిరుద్యోగులకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గుడ్ న్యూస్ అందించారు. శని, ఆదివారాల్లో గుంటూరు-విజయవాడ జాతీయరహదారిపై నెలకొన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజుల పాటు వైసీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు జాబ్ మేళా ఏర్పాట్లను శుక్రవారం మధ్యాహ్నం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి, కృష్ణా,…
చంద్రబాబుకి అమరావతి మీదే ప్రేమ.. విశాఖకు పరిపాలన రాజధాని చంద్రబాబు వద్దంటే.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? ఫైర్ అయిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. సోషల్ మీడియా వేదికగా తాజా మాజీ మంత్రి అవంతికి కౌంటర్ ఇస్తూ.. విశాఖని రాజధానిగా ప్రకటించిన తరువాత అవంతి గారి రాసలీలల ఆడియో విడుదల తప్ప ఏమైనా జరిగిందా..? విశాఖ అభివృద్ధికి అదనంగా ఒక్క రూపాయైనా…