ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య కలకలం సృష్టిచింది… దీనికి కారణం వైసీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరే కారణంగా తెలుస్తోంది.. ఇక, గంజిప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేదుకు వెళ్లిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు ఎదురుతిరిగారు.. మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. చివరకు పోలీసుల రక్షణ వలయంలో ఆయన్ను సురక్షితంగా తరలించారు పోలీసులు.. అయితే, ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై సంచలన ఆరోపణలు చేశారు మృతుడు గంజి ప్రసాద్…
గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు చినికి చినికి గాలివానగా మారుతున్నాయి. దీంతో అక్కడ రెండువర్గాలుగా విడిపోవడంతో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి లో దారుణ హత్య జరిగింది. దీంతో అక్కడ కలకలం రేగింది. వైసీపీ గ్రామ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్ ను నరికి చంపారు కొంతమంది దుండగులు. దీంతో ఊరు చివర పడి ఉంది ప్రసాద్ మృత దేహం. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. గ్రామ సర్పంచ్…
టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి… ఖబడ్దార్ చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించిన ఆయన.. దమ్ముంటే చంద్రబాబు లేదా లోకేష్ తంబళ్లపల్లెలో నాపై పోటీ చేయాలని.. డిపాజిట్లు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు.. ఇక, కుప్పంలో రాజీనామా చేయి.. నీకు డిపాజిట్లు గల్లంతు చేస్తానని ప్రకటించారు. ఎక్కడో నీ పక్కన కిశోర్ కుమార్ రెడ్డిని, కడప నుంచి వచ్చిన శ్రీనివాసులు రెడ్డిని…
మేం సిగ్గు పడుతున్నాం.. అధికారులుగా మీకు ఉందో లేదో నాకు తెలియదు అంటూ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి.. నెల్లూరు జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన.. నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ప్రారంభిస్తామని అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలను అధికారులు బేఖాతరు చేస్తున్నారని.. తప్పుడు సమాచారం ఇచ్చి.. ముఖ్యమంత్రి చేత తప్పుడు ప్రకటనలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్…
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో రెడ్లు రెండు వర్గాలుగా విడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న చిన్న గొడవలతో తమ పార్టీలోని రెడ్లు వర్గాలుగా విడిపోవడం చూస్తే బాధేస్తుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తానేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తన పదవికి రాజీనామా కూడా చేస్తానన్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన రెడ్లు దళితులపై పడుతున్నారని నారాయణస్వామి అన్నారు. వర్గాలుగా విడిపోయిన రెడ్లు ఏమైనా చేస్తారని అభిప్రాయపడ్డారు.…
గన్ కంటే ముందే దూసుకువస్తానన్న జగన్ ఎక్కడా.. ? అంటూ ప్రశ్నించారు నారా లోకేష్.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి వెళ్లిన ఆయన.. దుండగుల అఘాయిత్యానికి బలైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు.. అయితే, లోకేష్ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ దశలో టీడీపీ-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాళ్లు రువ్వుకున్నాయి.. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు.. ఇక, బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. చట్టాలంటే…
ముందస్తు ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. మరోసారి ముందస్తు ఎన్నికల ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసిన ఆయన.. 2024లోనే ఎన్నికలు ఉంటాయన్నారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి… ఈ ఏడాది చివరిలోగా దశల వారీగా 2 లక్షల 16 వేల టిడ్కో ఇల్లులు లబ్ధిదారులకు అందిస్తాం అన్నారు. ఈ ఏడాది మే నాటికి 40 వేల ఇళ్లు పూర్తి చేస్తాం…
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ..? మాటలు తప్ప చేతలు లేని చేతగాని ప్రభుత్వమిది.. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదు అంటూ ఫైర్ అయ్యారు మనోహర్.. పోలీసులను రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతి భద్రతలను గాలికొదిలేశారని ఆరోపించిన ఆయన.. దిశ చట్టం చేశాం.. గన్ కంటే జగన్ ముందు వస్తాడు.. లాంటి మాటలు…
2024 ఎన్నికలకు సిద్ధం అవుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వైసీపీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసిన పార్టీ అధినేత వైఎస్ జగన్.. రాష్ట్రంలోని 175 స్థానాల్లో 175 ఎందుకు గెలవకూడదు అని ప్రశ్నించారు.. దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సెటైర్లు వేస్తోంది… సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి… రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ పార్టీకి 175 స్థానాలు ఎలా వస్తాయి..? అని…