గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా చర్చించిన సీఎం… గడప గడపకూ మన ప్రభుత్వంపై ఆసక్తికర కామెంట్లు చేశారు.. ప్రతి మంత్రి తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించిన ఆయన.. ఎవరైనా పథకాలు అందలేదంటే వారికి ఓపిగ్గా వివరణ ఇవ్వాలన్నారు. కొంతమంది ఇంకా మొదలు పెట్టినట్టు లేదు అని పరోక్షంగా ప్రస్తావించిన సీఎం జగన్.. టీడీపీ మీడియాలో వచ్చే…
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వివాదంలో మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన వ్యవహారం ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తారాస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నారాయణ ఫోన్‌ను ట్యాప్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించడం.. అగ్గికి ఆజ్యం పోసినట్టయ్యింది. దీంతో.. ఫోన్ ట్యాప్ చేయడం నేరపూరిత చర్య అని, అందుకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసు రిజిష్టర్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష…
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.. మూడేళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంజాయ్ చేశారు.. మిగిలిన రెండేళ్లు కార్యకర్తల్ని అక్కున చేర్చుకుని మంచి చేస్తే మరోసారి ఎమ్మెల్యేలు అవుతారన్న ఆయన.. లేక పోతే పుట్టగతులు కూడా ఉండవు అంటూ హెచ్చరించారు.. ఇక, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఎమ్మెల్యేలను సహించబోనంటూ వార్నింగ్ ఇచ్చిన బాలినేని.. ఈ విషయంలో నాపై సీఎం వైఎస్ జగన్ కి ఫిర్యాదులు చేసుకున్నా భయపడేదిలేదన్నారు. Read Also: Telangana:…
జగన్ ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపణలు చేశారు. ఈ చర్యకు పాల్పడి, జగన్ ప్రభుత్వం అత్యంత నేరపూరిత చర్యకు పాల్పడిందని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైపీపీ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు.. జగన్‌తో సమానమైన మంత్రి పెద్దిరెడ్డే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. తన మూడేళ్ళ పాలనతో జగన్ ఎంతమంది నేతల ఫోన్లను ట్యాప్ చేశారో, ఎందరి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారో చెప్పాలని నిలదీశారు. ఫోన్ల…
మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై టీడీపీ నేతలు ఓ రేంజ్లో మండిపడుతున్నారు. ప్రభుత్వం కక్షపూరితంగానే నారాయణను అరెస్ట్ చేసిందంటూ ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందని.. ఓ విప్లవకారుడు అరెస్ట్ అయినట్లు చంద్రబాబు సహా టీడీపీ నేతలందరూ గగ్గోలు పెడుతున్నారని సజ్జల కామెంట్ చేశారు. పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకులను జగన్ ప్రభుత్వ వైఫల్యంగా టీడీపీ నేతలు ఆరోపించారని.. అలాంటప్పుడు తమ…
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తప్పు పట్టారు. ఆయన్ను అరెస్ట్ చేయడం దుర్మార్గమని చెప్పిన ఆయన, ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే జగన్ ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులందరూ వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలన వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కుంటుపడిందని, వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే నారాయణ అరెస్ట్‌కు తెరలేపారని చెప్పారు. అసలు ఏ కేసులో…
ఏపీలో జిల్లాల పునర్విభజన తర్వాత నరసాపురం పార్లమెంట్ పరిధి పశ్చిమగోదావరి జిల్లాగా మారింది. కాకపోతే జిల్లా కేంద్రంగా నరసాపురానికి బదులు భీమవరాన్ని చేశారు. ఇదే నరసాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరని చిచ్చుగా మారింది. వివిధ పార్టీల నాయకులు.. ప్రజా సంఘాలు JACగా ఏర్పడి నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమించాయి. అప్పట్లో ఈ సెగ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు గట్టిగానే తగిలింది. సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం…
మంత్రి పదవి తొలగింపు తర్వాత కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న కొడాలి నాని.. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. సీఎం జగన్‌తో సమావేశం అయ్యాక మీడియాతో మాట్లాడిన ఆయన.. మరోసారి చంద్రబాబుపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు, మోసగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ఎవరు కలిసినా, ఎన్ని గ్రూపులు వచ్చినా.. వారిని చెల్లాచెదురు చేయడానికి సింహం రెడీగా ఉందన్నారు. జగన్‌కు ఉన్న 50 శాతంపైగా ఓట్లు అలాగే ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లోనూ…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పొత్తుల గురించే మొత్తం చర్చ… ఏ పార్టీ నేత నోట విన్నా.. అదే మాట… పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీని టార్గెట్ చేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పవన్ కల్యాణ్.. బీజేపీ, టీడీపీలతో కలిసి పోటీ చేస్తారా..? లేక బీజేపీని వదిలి టీడీపీతో కలిసి పోటీ చేస్తారా..? అని నిలదీశారు. ఇక, చంద్రబాబు, పవన్…
కాకినాడ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. ఏపీలో పొత్తు రాజకీయాల చర్చకు దారి తీశాయి. అధికార పార్టీ నేతలందరూ ఒక్కాసారిగా దిగొచ్చి.. చంద్రబాబుకు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదని, అందుకే పొత్తులకు సిద్ధమయ్యారంటూ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రంగంలోకి దిగి, తన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలంటూ తాను కాకినాడలో…