మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై టీడీపీ నేతలు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. ప్రభుత్వం కక్షపూరితంగానే నారాయణను అరెస్ట్ చేసిందంటూ ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందని.. ఓ విప్లవకారుడు అరెస్ట్ అయినట్లు చంద్రబాబు సహా టీడీపీ నేతలందరూ గగ్గోలు పెడుతున్నారని సజ్జల కామెంట్ చేశారు. పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకులను జగన్ ప్రభుత్వ వైఫల్యంగా టీడీపీ నేతలు ఆరోపించారని.. అలాంటప్పుడు తమ ప్రభుత్వం ఈ అంశంలో చర్యలు తీసుకుంటే తప్పేంటని సజ్జల ప్రశ్నించారు. 100 శాతం ఉత్తీర్ణత కోసమే పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్ వంటి అక్రమాలకు కొన్ని విద్యాసంస్థలు పాల్పడుతున్నాయని.. ఇందులో భాగంగానే నారాయణ అరెస్ట్ అయ్యారని సజ్జల వివరించారు. గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నందున వ్యవహారం అంతా సాఫీగా జరిగిందని.. ఒక మాఫియాలా ఏర్పడి ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.
Kurnool: అమ్మ ఒడి వద్దు.. రోడ్డు వేయించండి.. మంత్రికి నిరసన సెగ
పేపర్ లీక్ వంటి దారుణాలకు పాల్పడ్డ వారి విషయంలో టీడీపీ విధానం ఏంటో ముందు చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. రాజకీయ కక్ష సాధింపు అంటే చంద్రబాబును అరెస్ట్ చేస్తారా లేదా నారాయణను అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. నారాయణ విద్యాసంస్థలకు తాను ఛైర్మన్ కాదని నారాయణ సాంకేతిక కారణాలను చూపుతున్నారని సజ్జల ఆరోపించారు. పేపర్ లీకుల విషయంలో నారాయణ గైడ్ చేసేవాడని నారాయణ సంస్థల డీన్ బాలగంగాధర్ వాంగ్మూలంలో ఉందన్నారు. అలాంటప్పుడు ఆయన నిందితుడు అవుతాడు కదా అన్నారు. నారాయణ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. వ్యవస్థీకృతం చేసే ఇలాంటి నేరాల పట్ల తాము సీరియస్‌గా ఉంటామన్నారు. ఏ కేసులో అయినా ఆధారాలు ఉంటేనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డుకు అన్ని విషయాలు పూర్తి అయ్యాయని… వాళ్ళ గవర్నమెంట్ వచ్చి ఉంటే పనులు కూడా మొదలయ్యేవని సజ్జల అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ లింగమనేని రమేష్‌కు లబ్ది జరిగేలా గత ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నారని.. చంద్రబాబు కుటుంబం అక్కడ భూములు హెరిటేజ్ పేరుతో కొనకుండా ఉండాల్సిందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు అక్రమాలపై ప్రభుత్వం వద్ద రికార్డులు అన్నీ ఉన్నాయన్నారు. రింగ్ రోడ్డు విషయంలో గత ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వారితో ముఠాలా మారి రైతులను మోసం చేసిందన్నారు. అమరావతి విషయంలోనూ రియల్ ఎస్టేట్ కంపెనీలా గత ప్రభుత్వం వ్యవహరించిందని సజ్జల ఆరోపించారు.