ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిపోయింది. ఒకరిపై మరొకరు తీవ్రంగా దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా టీడీపీ నేత కూన రవికుమార్.. స్పీకర్ తమ్మినేని సీతారాంపై ధ్వజమెత్తారు. ఆయన పిచ్చోడైపోయాడని, నియోజకవర్గంలో ఒక్క పని కూడా చేయలేకపోయారని విమర్శించారు. స్పీకర్‌గా ఉంటూ, రాజకీయాల మీద బెట్టింగ్‌లు కడతానంటున్న ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రవికుమార్ ప్రశ్నించారు. ఉద్యోగాలిస్తానని ప్రజల దగ్గర నుంచి డబ్బులు దండుకున్నారని, అందుకే మీకు ఓట్లు వేయాలా?…
తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం డిప్యూటీ సీఎం నారాయణస్వామి దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకోగా.. వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. జగన్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ చదివాడని.. అందుకే ఆయన అన్ని మతాల వారిని సమానంగా చూస్తాడని కొనియాడారు. Andhra Pradesh: రేపు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన గడప…
తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధం అవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇటీవలే మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించిన ఆయన.. కుప్పంలో ఇల్లు కడుతున్నా.. ప్రతీ మూడు నెలలకు నియోజకవర్గంలో పర్యటన ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక, కుప్పం-పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండల పరిధిలోని కడపల్లె, కనమలదొడ్డి గ్రామాల మధ్య శివపురం దగ్గర చంద్రబాబు ఇల్లు కోసం స్థలం తీసుకున్నారని.. త్వరలోనే భూమి పూజలు చేసి.. నిర్మాణ…
ఇసుక సరఫరా మరోసారి ఏపీలో రచ్చగా మారింది.. ఇసుక విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. ఇసుకను ఆన్లైన్లో విక్రయిస్తున్నాం.. కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ అధికార పార్టీ కౌంటర్ ఇస్తుంది.. ఇక, ఇసుక వివాదంపై స్పందించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇసుక పాలసీపై తప్పుడు ప్రచారం చచేస్తున్నారని మండిపడ్డ ఆయన.. నూతన ఇసుక విధానం పారదర్శకంగా ఉందన్నారు. చంద్రబాబు హయంలో ఇసుక మాఫియా రెచ్చిపోయిందన్న విమర్శించిన ఆయన.. చంద్రబాబు ఇంటి పక్కన ఇసుక అక్రమ తవ్వకాలు…
తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం… టీడీపీ ఇక ప్యాకప్ అనేశారు.. పొట్టలో కత్తులు పెట్టుకుని పొత్తులకు సిద్దమవుతున్నారు… అవన్నీ పొలిటికల్ ఫిలాసఫీ లేని పార్టీలు అని ఫైర్ అయిన ఆయన.. పొలిటికల్ ఫిలాసఫీతో సీఎం జగన్ ఉన్నారు… అందుకే సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తు.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపిస్తున్నారని తెలిపారు.. పిల్లల విద్యా కోసం నాడు నేడు, విద్యా దీవెన, అమ్మ ఒడి.. ఇలా అనేక కార్యక్రమాలు రూపొందించారని.. కానీ,…
టిడ్కో ఇళ్ల కేటాయింపులపై వైసీపీ ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. ఆగస్టు 15వ తేదీలోగా టిడ్కో ఇళ్లను కేటాయించాలని వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ గడువు పెట్టారు.. 30 లక్షల ఇళ్లు ఇస్తున్నామని చెబుతోన్న ప్రభుత్వం అక్కడ ఏం చేయలేదన్న ఆయన.. ఏపీలో టిడ్కో ఇళ్ల కోసం కేంద్రం రూ. 12 వేల కోట్లు కేటాయించిందన్నారు.. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఎలాట్ చేయకుంటే.. బీజేపీ ఉద్యమిస్తుందని ప్రకటించారు.. రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో ఇళ్లను…
పోర్ట్ సిటీ విశాఖపట్నంలో అధికార వైసీపీ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. తూర్పు, దక్షిణ నియోజకవర్గాల కుమ్ములాటలు కొలిక్కి రాకముందే పశ్చిమంలో ముసలం పుట్టింది. మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ విజయప్రసాద్‌కు హైకమాండ్ షాక్ ఇచ్చింది. పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పించి ఆ స్ధానంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌ను నియమించింది. “గడపగడపకు” ప్రభుత్వం కార్యక్రమం సమన్వయం చెయ్యాలని శ్రీధర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి.…
జీడీసీసీ బ్యాంకులో పెద్దఎత్తున అక్రమాలు జరిగిన దృష్ట్యా తక్షణమే ఆ సంస్థ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, సీఈవో కృష్ణవేణిలను పదవుల నుంచి తొలగించాలని సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డితో సమావేశం అయ్యారు. జీడీసీసీ బ్యాంకులో జరుగుతున్న అక్రమాలను నివేదించారు. వీరితో పాటు మొత్తం పాలకవర్గాన్ని రద్దు చేయాలన్నారు. ఇప్పటివరకు జరిగిన అక్రమాల్లో బ్యాంకుతో పాటు రెవెన్యూ అధికారుల ప్రమేయం ఉందన్నారు. రూ.కోట్లలో బ్యాంకు సొమ్ము…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. ఏపీ ముఖ్యమంత్రి నోట ఈ మధ్య కాలంలో ఎన్నికల మాట వినిపిస్తోంది. ముందస్తు వున్నా లేకున్నా. వైసీపీ నేతలు జనంలోకి వెళ్లాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశించడం వెనుక వ్యూహం ఏంటనేది అంతుపట్టడం లేదు. ప్రజల్లో ఉండటం పైనే సీఎం జగన్ ఫోకస్ పెడుతున్నారు. 12వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశం సందర్భంగా మంత్రులకు సీఎం జగన్ డైరెక్షన్ ఇవ్వడం వెనుక వ్యూహం…
ఓవైపు గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో నడుస్తుండగా.. మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ కూడా అదే తరహాలో కార్యక్రమాన్ని తీసుకున్నారు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రజలకు తుఫాను హెచ్చరికతో పాటు వైసీపీ నాయకులు వస్తున్నారు జాగ్రత్త అంటూ సెటైర్లు వేశారు.. వైసీపీ ఎమ్మెల్యేలను చూస్తే జాలి పడే పరిస్థితి తెచ్చుకున్నారు.. ఎన్నికలు వస్తున్నాయని భయంతో గ్రామాల్లో గడపగడప తిరుగుతూ ఓట్లు అడుక్కునే పరిస్థితికి దిగజారాన్నారు. ఇక, వలంటీర్లను బ్లాక్ మెయిలర్లుగా తయారు…