Gudivada Amarnath: పవన్‌కు మంత్రి ఆఫర్.. ‘సీఎం పవన్ కళ్యాణ్’ పేరుతో సినిమా తీస్తే నేనే ప్రొడక్షన్ చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాత్.. అనకాపల్లిజిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన ఫ్యాన్స్ కలలు కంటున్నారు.. అయితే, ‘సీఎం పవన్ కళ్యాణ్’ పేరుతో సినిమా తీస్తే నేనే ప్రొడక్షన్ చేస్తానన్నారు.. అంటే, పవన్ కల్యాణ్‌ను తెరపై సీఎంగా చూసుకోవచ్చు.. నిజ జీవితంలో ఆయన సీఎం కాలేరనే తరహాలో ఎద్దేవా చేశారు.. ఇక, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు కూడా తెలియని వాడు పవన్ కళ్యాణ్.. అలాంటి వ్యక్తి సీఎం అవుతారా? అని ప్రశ్నించారు.. ఆయన సినిమాల్లో పవర్ స్టార్.. కానీ, పాలిటిక్స్ లో ప్యాకేజ్ స్టార్ అంటూ మరోసారి విరుచుకుపడ్డారు..
Read Also: KA Paul: చంద్రబాబు కంటే జగన్ వేయి రెట్లు బెటర్.. నా సలహాలు పాటించారు
Also Read
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
ఇక, 2024ఎన్నికల్లో టీడీపీకి మహాప్రస్థానం ఖాయం అని జోస్యం చెప్పారు మంత్రి అమర్నాథ్.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన ఏ పథకం అయినా.. వ్యవస్థనైనా తీసేసే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. మూడేళ్ళలో నా మీద ఒక్క అవినీతి మచ్చ కూడా లేదు.. ఉంటే నిరూపించండి అంటూ సవాల్ చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల భుకబ్జాలను అడ్డుకున్నాం.. సెంటు కాదు కదా సెంటీమీటర్ భూమి కూడా మీరు ఆక్రమించ లేరని ప్రకటించారు. సహకార చక్కెర కర్మాగారాలు నాశనం చేసింది చంద్రబాబే అని ఆరోపించారు.. చెరకు పంట లభ్యత లేనందునే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరవలేకపోతున్నాం అని వివరించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. మరోవైపు.. పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.. ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని చంద్రబాబు అణిచివేసినప్పుడు పవన్ ఎక్కడ దాక్కున్నారు? అని నిలదీశారు.. ముద్రగడను చంద్రబాబు ప్రభుత్వం వేధించినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు.. హరి రామజోగయ్య దీక్షచేస్తేనే పవన్ కల్యాణ్ స్పందించారు.. టీడీపీ ప్రభుత్వంలో మాట్లాడని పవన్.. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు.. పవన్ ఇప్పుడే మాట్లాడటం వెనుకున్న ఉద్దేశం ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?