వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ అధిష్టానం షాకిచ్చింది. ఆయనను పార్టీ బాధ్యతలనుంచి తప్పించింది. వెంకటగిరి ఇన్ ఛార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నియామకం చేయబోతోంది.. ఆనంపై అధిష్టానం వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళో, రేపో వైసీపీ దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేయనుంది. బాలాయపల్లి మండల కేంద్రంలో… వైఎస్సార్ పింఛను కానుకను ప్రారంభించిన ఎం.ఎల్.ఏ. ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. సచివాలయం, వాలంటీర్లకు సచివాలయ భవనాలు లేవు. వాళ్ళు ఎక్కడ కూర్చొని పనిచేయలో తెలియడంలేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన విమర్శలు అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి.
Read Also: Rashtrapati Bhavan : సామాన్యులకు సదవకాశం.. జనవరి 15 వరకు రాష్ట్రపతి భవన్ సందర్శన
అద్దె భవనాల్లో, పాడుబడ్డ స్కూళ్ల లోనో. అంగన్వాడీల్లోనో కార్యాలయాలు పెట్టుకుంటున్నారు. నిధులు మంజూరు చేసినా మండలంలో భవనాలు పూర్తి కావడం లేదు. సచివాలయ ఉద్యోగులు ఏమి పనిచేయడం లేదంటే, ఇక్కడ కూర్చోవడానికి స్థలం లేదంటున్నారు.వర్షం పడితే బిల్డింగులు కురుస్తున్నాయి,కంప్యూటర్లు..ఫైళ్లు తడిచిపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి.భవనాలు ఉంటేనే సచివాలయ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించగలగుతారు. మౌలిక వసతులు లేనిదే ఏ ప్రభుత్వ అధికారి పనిచేయలేరు. సచివాలయ ఉద్యోగులు ఉన్నత చదువులు చదివి దిక్కులేక రావడం లేదు.
వాళ్ళు చదివిన చదువులకు, డిగ్రీలకు ప్రభుత్వాల్లో, ప్రయివేటు రంగంలో ఎక్కువ జీతాలు వస్తాయి. ప్రజాసేవకోసమే వాళ్ళు సచివాలయ ఉద్యోగాలకు వచ్చారు. అధికారులు ఇకనైనా భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేసి, పూర్తిచేయాలన్నారు. ఇదిలా ఉంటే.. మరో మారు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ముందస్తు ఎన్నికలు అంటున్నారు.. అవిగాని వస్తే సంవత్సరంలోపే ఇంటికి వెళ్ళడం ఖాయం.. ప్రజలు మాకు అధికారం ఇచ్చి ఐదు ఏళ్ళు పూర్తి కావస్తోంది..కానీ ఇంకా సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదు.
Read Also: Chinese Manja : బైకర్ ప్రాణం తీసిన పతంగి మాంజా
సాంకేతిక కారణాలా లేక.. చెల్లింపులు ఆలస్యమ వుతుందని కట్టడానికి ముందుకు ఎవరు రావడం లేదా.. తెలియడం లేదు..ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు, నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా ఉంది..నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు వేస్తున్నాం..కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వాగుల వద్ద హై లెవెల్ బ్రిడ్జిలు కట్టబోతున్నాం.. త్వరలో టెండర్లు కూడా పిలుస్తాం అన్నారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. నియోజకవర్గ బాధ్యతల్ని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగిస్తారనే వార్తల నేపథ్యంలో ఆయన అనుచరులు సందడి చేస్తున్నారు.