Rk Roja: చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఫిర్యాదు చేసింది. తనపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, అగౌరవంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని కోరింది.
Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటంతో.. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చారు.
Ambati Rambabu: ఢిల్లీలో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారని చెప్పారు.. కొన్ని నిర్ణయాలు వస్తాయని అందరూ ఎదురు చూశారు.. ఈ సమావేశంలో అసలు ఏ ధమైన చర్చ జరగలేదు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
గట్టిగా కళ్లు మూసుకుంటే మూడేళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు అని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం కౌంటర్ ఇచ్చారు. క్లైమోర్ మైన్సే నన్ను ఏం చేయలేదు.. జగన్ లాంటి వాళ్లు నన్ను ఏం చేయలేరు అని ధీమా వ్యక్తం చేశారు. తిట్లు, శాపనార్ధాలు నాకు తాకవు అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Minister Payyavula: పలేగాళ్ల రాజ్యం గురించి విన్నాం.. కప్పం గట్టమని పొలంలో పంటలు కోసుకుపోయారు.. పాలేగాళ్ల వంశానికి చెందినవాడు జగన్ అని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. పాలేగాళ్ల రాజ్యం తిరిగి తీసుకురావాలని జగన్ చూస్తున్నారు.. చంద్రబాబు 100 రోజుల్లో 6 పంపుల నుంచి 12 పంపుల ద్వారా నీరు విడిచే విధంగా పనులు చేశారు.
టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ.. ఆధిపత్యం కోసం కాంగ్రెస్... రాజకీయ ఉనికి కోసం మళ్ళీ తెలుగుదేశంలోకి.... ఆపై ఢిల్లీలో పట్టుకోసం వైసీపీలోకి జంప్. ఇలా కాలమాన పరిస్థితులకు తగ్గట్టు ఎప్పటికప్పుడు వ్యూహాలు, పార్టీలు మారుస్తూ... తన రాజకీయ ఉనికి చాటుకుంటుంటారు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వలేదంటూ ప్రెస్ మీట్లో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో టీడీపీ నాయకులు చేసిన అరాచకాలు మరువ లేకుండా ఉన్నారని, పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చే సమస్యే లేదన్నారు. పెద్దారెడ్డి విషయంలో ఎంత దూరమైనా వెళ్తానని, తనతో ప్యాక్షన్ చేస్తానని సవాలు విసిరిన వ్యక్తిని తాడిపత్రిలోకి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు.
దక్షిణ భారతదేశంలో హిందీ భాషపై జరుగుతున్న చర్చపై స్పందించారు మాజీ సీఎం వైఎస్ జగన్.. పేద పిల్లలకు పోటీతత్వాన్ని పెంపొందించటానికి హిందీని ఒక భాషగా బోధించవచ్చన్న ఆయన.. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా మాధ్యమం ఇంగ్లీష్ అయి ఉండాలని స్పష్టం చేశారు.. ఇంగ్లీష్ ఒక ప్రపంచ భాష.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు దానిని అనర్గళంగా నేర్పిస్తే ఉద్యోగ అవకాశాల కల్పనను సులభతరం చేస్తుందన్నారు..
గోదావరి జలాలు, పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. పోలవరం ప్రాజెక్టు మరియు గోదావరి జలాల సమస్యకు సంబంధించి స్పష్టంగా అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఉందన్న ఆయన.. ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఇందిరా సాగర్ ప్రాజెక్టు పురోగతిని అడ్డుకుంది.. గోదావరి నదికి చెందిన అనేక ప్రధాన ఉపనదులు ఛత్తీస్‌గఢ్ లోని ప్రాణహిత, ఇంద్రావతి మరియు శబరి వంటివి కేంద్ర సహకారంతో పొరుగు రాష్ట్రాలు చేపట్టిన…
ఏపీ లిక్కర్ స్కాంపై సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. కేసుకు సంబంధించి ప్రైమరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఒకవైపున కసరత్తులు చేస్తున్న అధికారులు.. మరోవైపున సేకరించిన సమాచారం ఆధారంగా నిందితులను కూడా అరెస్టు చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్‌కు సంబంధించి 40 మందిని నిందితులుగా చేర్చిన సిట్ 11 మందిని అరెస్టు చేసింది..