Anitha Vangalapudi: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత తాజాగా మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే అన్ని ఆధారాలు ఉంటే తప్ప అరెస్టు చేయమన్నారు. పక్కా ఆధారాలతోనే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశామన్నారు. అక్రమ అరెస్ట్ అంటే.. సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసిందని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే ఆమె మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఫైళ్ల దహనం కేసు, అటవీ భూముల్లో అక్రమ నిర్మాణాలపై కేసులో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉందని.. ఇంకా ముగిసిపోలేదని ఆమె అన్నారు.
Pawan Kalyan : నేను యాక్సిడెంటల్ యాక్టర్ ని.. ఈ మీడియా మీట్ ఎందుకు పెట్టానంటే?
గండికోటలో బాలిక హత్య కేసుకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో నిందితుడి పై క్లారిటీ వస్తుందని హోం మంత్రి తెలిపారు. ఇక గుహ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పి సాక్షి క్యాలెండర్ విడుదల చేసారు అన్నారు. అలాగే డిఫెన్స్ పరిశ్రమ మడకశిరలో రాబోతుందని ఆమె తెలిపారు. ఒక్క ఛాన్స్ అన్న పాపానికి 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్లనుందని ఆమె గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. నాడు- నేడు కార్యక్రమం అంతా పైన పటారం.. లోన లోటారంలా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఆ కార్యక్రమంపై విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆమె అన్నారు. భార్యలు భర్తలను హత్య చేసే విషయంలో టీవీ సీరియల్స్ , సినిమాల ప్రభావం ఎక్కువగా ఉందని మాట్లాడారు.
Vizag Online Betting: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం.. ప్రధాన బుకీ గోపి అరెస్ట్..!