పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. పామర్రు పోలీస్ స్టేషన్ కు ఇప్పటికే జిల్లా ఎస్పీ గంగాధర్ చేరుకున్నారు. మచిలీపట్నం లేదా పామర్రు పోలీస్ స్టేషన్ లో పేర్ని నానిపై కేసు నమోదు చేయనున్నారు.
Gudivada Tension: కృష్ణా జిల్లాలోని గుడివాడ కే కన్వెన్షన్ లో జరుగుతున్న వైసీపీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన జెడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారికతో పాటు వైసీపీ ఇంచార్జ్ ఉప్పాల రామును అదుపులోకి తీసుకుని పట్టణంలోని వన్ టౌన్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.
Gudivada Tension: కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ, కూటమి పోటాపోటీ కార్యక్రమాలతో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నాగవారప్పాడు జంక్షన్ నుంచి K కన్వెన్షన్ సెంటర్ వైపు వైసీపీ కార్యకర్తలు వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు ఆడుకుంటున్నారు. ఇప్పటికే, మాజీ మంత్రి పేర్నినాని సహా ముఖ్య నాయకులను మచిలీపట్నంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలోని K కన్వెన్షన్ లో వైసీపీ బాబు షూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ సమావేశానికి భారీగా వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇక, అనారోగ్య కారణాల వల్ల ఈ మీటింగ్ కు దూమాజీ మంత్రి కొడాలి నాని, ఆయన అనుచరులు దూరంగా ఉన్నారు.
Dharmana Prasada Rao: చంద్రబాబు మ్యానిఫేస్టో అమలు చేయడని మన అందరికి తెలుసు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఆ విషయం కార్యకర్తలు ప్రజలకు చెప్పాలి.. ప్రతిపక్షంలో ఉన్నవారు.. ప్రజలకు లోపాలను ఎత్తి చూపడానికి ప్రయత్నించాలి..
High tension in Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జరగనుంది. ఈ సభకు మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
Ambati Rambabu: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. కూటమి ఏడాది పాలన సుపరిపాలన కాదు.. మోసపు పరిపాలన.
కృష్ణా జిల్లాలో బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమాల్లో మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలు చర్చగా మారుతున్నాయి. పామర్రు, అవనిగడ్డ నియోజక వర్గాల్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ మీటింగ్స్ లో పేర్ని నాని మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ మాదిరి.. మీరు కూడా చెడిపోయారా..? లోకేష్ రెడ్ బుక్ అంటే.. మీరు రప్పా రప్పా అంటున్నారు అన్నారు. ఏదైనా చేయాలంటే చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి తప్ప రప్పా రప్పా అని అనటం కాదన్నారు.…
వైఎస్ జగన్ పర్యటనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్.. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ పరామర్శ పేరుతో దండయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.. పోలీసులు రక్షణ ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు.. ఎక్కువ మంది పోలీసులను పెడితే.. 2 వేల మంది పోలీసులను పెట్టారని మళ్లీ ఇప్పుడు కామెంట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
పల్నాడు జిల్లా... వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. వాలంటీర్ వ్యవస్థపై హాట్ కామెంట్స్ చేశారు.. నరసరావుపేటలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆయన.. వాలంటీర్ వ్యవస్థని నమ్ముకొని గత ఐదేళ్లు పూర్తిగా నష్ట పోయాం అన్నారు.. ఏ పార్టీకైనా కార్యకర్తలు మూల స్తంభాలు.. కానీ, వాలంటీర్లు కాదు అని స్పష్టం చేశారు..