విశాఖలో వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యా్ఖ్యలకు మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ ను పవన్ కల్యాణ్ ఏమీ పీకలేరని విమర్శించారు. పవన్ కల్యాణ్‌కు సత్తా ఉంటే సింగిల్‌గా రావాలి అని వెల్లంపల్లి శ్రీనివాసరావు సవాల్ చేశారు. సీఎం జగన్ గురించి ఏది పడితే అది.. ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునేది లేదని.. దేహశుద్ధి చేస్తామని హెచ్చరించారు. మరోవైపు రానున్న రోజులలో ప్రజలు పవన్‌కి తగిన రీతిలో బుద్ధి చెపుతారని తెలిపారు. పవన్ నోరు అదుపులో పెట్టుకోకపోతే తాటతీస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు చంద్రబాబుకు సేవ చేసేందుకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో.. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే 175 నియోజకవర్గాలలో సింగిల్‌గా పోటీ చేయాలని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం అమ్ముడుపోతున్న వ్యక్తి అని విమర్శించారు. ప్రస్తుత రాజకీయాల్లో పవన్ కల్యాణ్ కంటే.. కేఏపాల్ బెటర్ అని అన్నారు. అతన్ని చూసైనా పవన్ కల్యాణ్ సిగ్గు తెచ్చుకోవాలని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు.