చంద్రబాబు, లోకేష్ పై దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఉనికిని కోల్పోతోందని ఆరోపించారు. 600 హామీలు ఇచ్చి చేసిన మోసం పై సమాధానం చెప్పండని.. అవినీతి చేస్తే చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అని అవినాష్ అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి ఉషాశ్రీచరణ్ సవాల్ విసిరారు. మీరు హెరిటేజ్ ఆస్తులు పేదలకు పంచుతారా?.. అలా చేస్తే నేను కొనుగోలు చేసిన భూములు కూడా పంచేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. తనది సంపన్న కుటుంబమని.. తాను భూములు కొంటే తప్పా అంటూ మంత్రి ప్రశ్నించారు.
చట్టం ప్రశ్నించినపుడు ఎవరైనా సిద్ధపడాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. సీఎం జగన్ కేసుల వెనుక రాజీయ ప్రేరేపితం ఉందని ప్రజలు తెలుసుకున్నారని.. చంద్రబాబు లాగా కేసుల గురించి జగన్ కన్నీళ్లు పెట్టుకోలేదని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర ప్రధానమైనదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా.. మంచి నిర్ణయాలను, కార్యక్రమాలను సమర్ధిస్తామన్నారు. కానీ ప్రజాస్వామ్య విరుద్దంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేస్తే ప్రశ్నించకుండా ఎలా ఉంటామన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుకు భవిష్యత్ కళ్ళ ముందు కనపడుతోందని.. అడ్డంగా బుక్ అయినట్లు తనకే అర్థం అయినట్లుందని సజ్జల పేర్కొన్నారు.