TDP Open Letter: సీఎం జగన్‌కు టీడీపీ బహిరంగ లేఖ.. ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Open Letter: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది.. ఇప్పుడు కేసుల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా నడుస్తుండగా.. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు టీడీపీ నేతలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు తెలుగుదేశం పార్టీ నేతలు.. 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ సీఎం జగన్‌కు కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, షరీఫ్, సంధ్యారాణి లేఖ రాశారు..
ఇక, టీడీపీ నేతలు రాసిన లేఖ విషయానికి వస్తే..
* తెలుగుదేశం ప్రభుత్వం సొంత కాళ్లపై నిలబడేలా సంక్షేమ పథకాలు అమలు చేసింది. కాళ్లు విరిచి కట్టు కట్టి మహానుభావుడంటూ వైఎస్ జగన్ గురించి ప్రచారం చేసుకున్నారు..
Also Read
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
- Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
- SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
* టీడీపీ రూ.3లక్షలు సబ్సిడీతో ఇన్నోవా కార్లు ఇచ్చింది. జగన్ రెడ్డి వాహన మిత్ర పేరుతో రూ.10వేలు ఇచ్చి డీజిల్, మద్యం, జరిమానాలతో లక్ష లాక్కుంటున్నారు.
* బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పారిశ్రామిక రాయితీలు నిర్వీర్యం నిజం కాదా..? రూ.1.14 లక్షల కోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించడం వాస్తవం కాదా?
* అన్న క్యాంటీన్, నిరుద్యోగ భృతి లాంటి 120 సంక్షేమ పథకాలు రద్దు నిజం కాదా?
* 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్ని కబ్జాకు కుట్రలు చేస్తుండడం వాస్తవం కాదా?
* 1.42 లక్షల బ్యాక్ లాగ్ పోస్టుల్ని దూరం చేయడం వాస్తవం కాదా?
* స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కోత పెట్టి 16,800 పదవులు దూరం నిజం కాదా?
* విద్యా పథకాలు రద్దు చేసి వారిని చదువులకు దూరం చేయడం వాస్తవం కాదా?
* కల్తీ మద్యం అమ్మకాలతో 35 వేల మంది మహిళల మాంగళ్యాలు తెంచడం వాస్తవం కాదా?
* ఛార్జీలు, ధరలు, పన్నుల పెంపుతో ఒక్కో కుటుంబంపై రూ.2.78 లక్షల భారం నిజం కాదా?
* నామినేటెడ్ పదవుల్లో ఆయా వర్గాలకు ద్రోహం చేయడం వాస్తవం కాదా?
* వందల మందిని హత్య చేసి, వేల మందిపై దాడులు, కేసులతో జైల్లో నిర్బంధించడం వాస్తవం కాదా? అంటూ ఇలా లేఖలో సీఎం వైఎస్ జగన్‌ను నిలదీశారు టీడీపీ నేతలు.


తాజావార్తలు
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!