Minister Dharmana Prasada Rao: తమ ప్రభుత్వంలోనే వెనుకబడిన వర్గాలకు స్వేచ్ఛ వచ్చింది.. ఎవ్వరి ప్రమేయం లేకుండానే లబ్ధిదారులకు పథకాల ఫలాలు అందుతున్నాయన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. సుమారు అయిదున్నార సంవత్సరాలక్రితం జగన్ తోకలిసి వచ్చాం.. అప్పటి ప్రభుత్వం చేస్తున్నా అవినీతి పై అందరకీ వివరించాం.. ప్రజల ఆమోదంతో ప్రభుత్వాలు ఏర్పాడతాయి అన్నారు. 75 ఏళ్ల తర్వాత ఎలాంటి మార్పలు చోటు చేసుకున్నాయో మీకు చెప్పాలి.. అధికారం కోసం పోరాటం చెయ్యకుండానే వైసీపీకి అధికారం వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం ఉన్న వెనుకబడిన వారు మరే ప్రభుత్వంలో లేరు.. గతంలో అధికార పార్టీకి మడుగులొత్తే సంస్కృతి దేశం అంతటా ఉండేది.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని హింసించే సందర్భాలు ఉండేవి.. కానీ, ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది.. తన వాడు సర్పంచిగానో, ఎమ్మెల్యే గానో.. ఇంటి మీద జెండాను ఉండాల్సిన అవసరం లేకుండా పథకాలు ఇస్తోందన్నారు. ఇది రాజ్యాంగ చెప్పి విధానంగా అభివర్ణించారు.
Read Also: ISIS: సిరియాలో ఐసిస్ మారణహోమం.. 30 మంది ప్రభుత్వ అనుకూల బలగాల హతం..
చంద్రబాబు ఎన్నో సమావేశాలలో మాట్లాడారు.. ఒక్క కులానికో, వర్గానికో, లంచం తీసుకోకుండా ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారాన్ని ఎప్పుడైనా చెప్పగలిగారా..? అని ప్రశ్నించారు ధర్మాన.. అత్యల్ప వెనుకబడిన వర్గాలకు ఈనాడు స్వేచ్ఛ వచ్చింది.. అన్ని పథకాలూ అందరికీ ఎవ్వరి ప్రమేయం లేకుండా అందుతున్నాయన్నారు. 12 వేల 8 వంద కోట్ల రూపాయల వెచ్చించి పేదవాడికి ఇళ్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం.. ఏనాడూ గత ప్రభుత్వాలు చేయలేకపోయారే.. డబ్బులు పంచేస్తున్నారని చెప్పారు.. ఈ పథకాలన్నీ మా ప్రభుత్వం వచ్చాక తీసేస్తామని చంద్రబాబు చెప్పారని.. మళ్లీ మొన్న రాజమండ్రి సభకు వచ్చేసరికి సర్దుకొని ఈ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తానని చెబుతున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామంటున్నాడు.. మహిళల రుణమాఫీ చేస్తామని.. ఇప్పుడు అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు.. మరి గత ఐదేళ్లలో ఏం చేశావు చంద్రబాబు అని నిలదీశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.