టీడీపీ అంతర్గతంగా దివాళా తీసింది.. అందుకే రైల్వే క్షతగాత్రుల పరామర్శకు భువనేశ్వరి వెళ్తున్నారని విమర్శించారు. ఆమె టీడీపీ అధ్యక్షురాలు కానున్నారా? లోకేష్ ఏమయ్యాడు? ఎందుకు దూరం పెడుతున్నారు? అంటూ అనుమానం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కావలి పట్టణంలో ఒక బస్సు డ్రైవర్ ని కొంతమంది రౌడీ మూకలు కొట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఘటనకు పప్పు(లోకేశ్), దత్తపుత్రుడు (పవన్ కల్యాణ్) రాజకీయ రంగు పులిమారని ఆరోపించారు. ఆ రౌడీ ముఠాను ఎదిరించినందుకు తన కారు పై కూడా గతంలో దాడి చేశారని అన్నారు. రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా ముఖ్యమంత్రికి ఆపాదిస్తుంటారని ఎమ్మెల్యే రామిరెడ్డి…
చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటకి రారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు బాధగా ఉండవచ్చు అన్నారు. బాబు 13 చోట్ల సంతకాలు చేసారని.. స్కిల్ స్కాం రెడ్ హ్యాండెడ్ క్రైం అని తెలిపారు. చంద్రబాబు మెదటి నుంచి స్కాంల వ్యక్తేనని సీతారాం దుయ్యబట్టారు.
లోకేష్ కామెంట్స్ పై మంత్రి అమర్నాథ్ రియాక్షన్ ఇచ్చారు. చంద్రబాబు స్కామ్ పై రుజువులు న్యాయస్థానంకు ఇస్తాం కానీ.. నీలాంటి దొంగలకు కాదని లోకేశ్ పై మండిపడ్డారు. 13చోట్ల చంద్రబాబు సంతకం పెడితే అంత కంటే ఇంకేమి రుజువు కావాలని ప్రశ్నించారు. సీమెన్స్ సంస్థ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చిన వాంగ్మూలమే నిదర్శనమన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి విజయ సాయిరెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పకుంటే.. ఆయన పర్యటనలను అడ్డుకుని తీరుతామని తెలిపారు. మద్యం అక్రమాలు జరుగుతున్నాయని అంటున్నాం.. కాదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా..? అని ప్రశ్నించారు.
చట్టసభల్లో స్థానమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ బాషా (దూదేకుల) ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో నూర్ బాషా దూదేకుల సింహగర్జన కార్యక్రమం జరుగుతోంది. వైసీపీ యువనేత జాన్ సైదా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.