Markapuram MLA brother KP Krishnamohan Reddy Slams TDP Leaders: మార్కాపురం టీడీపీ నేతల భూదందాలు బయటపెట్టడంతో పాటు వారి ఆదాయానికి గండి కొట్టాననే ఉద్దేశంతో తమపై, వైసీపీ నాయకులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కేపి నాగార్జునరెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఈ దుష్ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. తమపై తప్పుడు ఆరోపణలు చేయిస్తూ.. రాజకీయ లబ్ది పొందేందుకు కుట్రలు చేస్తున్నారని కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు.
గత రెండు రోజులుగా టీడీపీ నేతల భూకబ్జాలు బయటపడటంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు తమపై దుష్ప్రచారం చేస్తున్నారు అని కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. వారికి అనుకూలమైన వ్యక్తులను ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి పంపించి.. తమపై తప్పుడు ఆరోపణలు చేయిస్తూ రాజకీయ లబ్ది పొందేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. ఇలాంటి ఛీప్ ట్రిక్స్ ప్రజలు అస్సలు పట్టించుకోరని, వాస్తవాలేమిటో అందరికీ తెలుసన్నారు.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ప్రజల్లో తగ్గిపోతున్న తమ రాజకీయ ప్రభావాన్ని కాపాడుకునేందుకు టీడీపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని ఎమ్మెల్యే కేపి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి హితవు పలికారు. ప్రజలకు మంచి చేస్తే వారు గుర్తుపెట్టుకుంటారని, తప్పుడు ఆరోపణలు చేయిస్తూ ప్రజల్లో ఉండాలనుకుంటే తగిన సమయంలో ఖశ్చితంగా బుద్ధిచెబుతారని హెచ్చరించారు.