కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతోంది.. ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ కేషన్న, పలువురు సర్పంచులు, కొంతమంది ఎంపీటీసీలు సమావేశం అయ్యారు.. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికే ఈసారి కూడా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. చెన్నకేశవరెడ్డికి టికెట్ ఇస్తే గెలిపిస్తాం.. వేరేవాళ్లకు టికెట్ ఇస్తే గెలిపించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఎమ్మిగనూరు ఎంపీపీ కేషన్న.
రెండో జాబితా ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. అయితే, గత కొంతకాలంగా మంత్రి రోజా స్థానం మారుస్తారనే చర్చ సాగుతూ వచ్చింది.. ఓ దశలో రోజాకు అసలు సీటు డౌటే అనే ప్రచారం సాగింది.. కానీ, నగరిలో మంత్రి ఆర్కే రోజా స్థానం సేఫ్ అని తెలుస్తోంది.. అంతే కాదు.. మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గం కూడా నో ఛేంజ్ అంటున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గా సాగుతోంది.. సీఎంవో నుంచి నేతలకు ఫోన్లు వెళ్లడం.. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆశావహులు ఇలా నేతలు సీఎంవోకు క్యూ కడుతున్నారు.
ఒక పార్టీ అధ్యక్షుడిపై గెలిచినపుడు గొప్పగా అనిపించింది.. ఇపుడు చూస్తుంటే చాలా మామూలు వ్యక్తిపై గెలిచినట్టు ఉంది అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పార్టీ పెట్టినప్పుడు చేగువేరాతో పాటు మహనీయుల ఫోటో పెట్టుకున్న పవన్ ఇపుడు అవి తీసేసి.. చంద్రబాబు ఫోటో పెట్టుకున్నారు.. చంద్రబాబులో పవన్ కళ్యాణ్ కి చేగువేరా కనిపిస్తున్నాడు అని ఆయన ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి గెలిచారు.. కానీ, గెలిచాక ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయలేకపోయారని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. వైసీపీ ఇచ్చిన 730 హామీల్లో 621 హామీలు అమలు చేయలేదు.. రాష్ట్రం అతలాకుతలంగా మారింది అని ఆయన చెప్పారు.
గురజాలలో పోటీ చేసే హక్కు నాకు ఉంది.. అందుకే అధిష్టానాన్ని సీటు కోరుతున్నాను అని ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి అన్నారు. గతంలో రెండు సార్లు నేను అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాను.. 2019లో కూడా పార్టీ అవసరాల మేరకే నేను సీటు త్యాగం చేశాను..
ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించడం లేదని అపవాదు వేస్తున్నారు.. మోడీ సర్కార్ భాగ్యస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగడం లేదు అని ఆమె అన్నారు.