ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ సీపీ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను మార్చుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన సమీక్షలో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఇక సీఎం జగన్ సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తరచు జరిగే సమీక్షలే చేశామని, తమ ప్రభుత్వం చేసిన, చేయబోయే…
ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. మార్పుల విషయంలో నాకు ఎటువంటి పిలుపు రాలేదు.. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభం కాబట్టి రైతుల పేమెంట్లు చెల్లింపుల కోసమే సీఎంవోకు వచ్చాను అని ఆయన తెలిపారు.
ఎన్నికల సమయంలో టికెట్ల కోసం ఆందోళన సహజం అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. టికెట్ల కోసం డిమాండ్ లేక పోతే ఎత్తిపోయిన పార్టీ అంటారు.. మా ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాము.. పార్టీ నేతల్లో ఏమైనా అసంతృప్తి వుంటే పిలిచి మాట్లాడతాం.. ఆ మాత్రం పోటీ, ఆందోళనలు లేకపోతే పార్టీ ఉన్నట్లు ఎలా తెలుస్తుందని ఆయన చెప్పారు.
ద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ.. ఇటివల నేను పార్టీ మారుతున్నానంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదు.. నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై జిల్లా లోని పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్ళా.. నన్ను వ్యక్తిగతంగా నా కులాన్ని సైతం దూషించారు.. జిల్లా పార్టీ పెద్దల నుంచి నాకు సరైన మద్దతు లభించకపోవటం నా దురదృష్టం.. ఒక ఎమ్మెల్యే అయి ఉండి సొంత వాళ్లే కించపరిచినా ఎవరూ ఓదార్చలేదు అని ఆయన పేర్కొన్నారు.
అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నెల్లూరు నగరం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇద్దరు నాయకులు తిరుగుతున్నారు.. రెండు, మూడు రోజుల నుంచి నెల్లూరులో విచిత్రమైన పరిస్థితి ఉంది.. ఎన్నికల్లో నేనే పోటీ చేస్తానని నారాయణ ఒకవైపు తిరుగుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కొందరు టీడీపీ నేతలతో కలిసి జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి తిరుగుతున్నారు..
ఆడుదాం ఆంధ్ర వల్ల ప్రజలకు ప్రయోజనం ఏమిటి అంటూ మాజీ మంత్రి ప్రశ్నించారు. జగన్ దోచుకోవడానికి ఇదొక కొత్త డ్రామా.. స్టేడియాల అభివృద్ధి లేదు.. క్రీడాకారులు ప్రోత్సాహం లేదు.. మంత్రి సీదిరి అప్పల రాజు నోరు అదుపులో పెట్టుకో.. చర్చకు రాకుండా పారిపోయిన నువ్వు.. ఇంకో సారి వాగితే రోడ్ల మీద తిరగనివ్వం అంటూ కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా నరసారావు పేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గపోరు తాడేపల్లికి చేరింది.. నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు స్థానిక నేతలు.. ఈ సారి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం ఆందోళన నిర్వహించింది..
విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీ పార్టీ మారుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.. దానికి మరింత బలాన్ని చేకూరుస్తూ.. ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం కాబోతున్నారు ఎమ్మెల్సీ వంశీ.. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేనలో చేరబోతున్నారంటూ ఓ వైపు ప్రచారం సాగుతుండగా.. ఇదే సమయంలో ఆయన పవన్‌తో భేటీకానుండడం హాట్ టాపిక్‌గా మారిపోయింది..