CM Jagan Bus Yatra: మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రాన్ని మరోసారి చుట్టేసే పనిలో పడిపోయారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో మళ్లీ ప్రజలతో మమేకం అవుతున్నారు. రేపు ఆరో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ పార్టీ విడుదల చేసింది. రేపు ఉదయం 9 గంటలకు అన్నమయ్య జిల్లా చీకటి మాను పల్లె నుండి బస్సు యాత్ర ప్రారంభం కానుంది.
Read Also: CM YS Jagan: కదిరిలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్
మొలకల చెరువు,పెద్దపాల్యం, వేపురి కోట మీదుగా బుర్రకాయల కోట క్రాస్, గొల్లపల్లి మీదుగా అంగళ్ళుకు బస్సు యాత్ర చేరుకోనుంది. సాయంత్రం 3.30 గంటలకు మదనపల్లె టిప్పు సుల్తాన్ గ్రౌండ్‌లో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా పుంగనూరు నియోజకవర్గం అమ్మగారిపల్లె శివారులో ముఖ్యమంత్రి రాత్రి బస చేయనున్నారు. ముఖ్యమంత్రి బస్సు యాత్ర కోసం వైసీపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.