Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. కూటమి పాలన అంటూ ఏమీ లేదు… ఆది కేవలం టీడీపీ పాలనే అన్నారు.. టీడీపీ వాళ్ల ఒక్కరి పైనే పాపం పడిపోకుండా.. కూటమి అని చెప్పుకుంటున్నారు.. కానీ, సమాజంలో ఉండే అట్టడుగు వర్గాల కోసం పని చేసే పార్టీ వైసీపీ మాత్రమే అన్నారు.. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా రాజ్యాంగబద్ధంగా పని చెయ్యాల్సిందే.. కానీ, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన జరగడం లేదన్నారు.. ఒక రాజధాని కోసం లక్ష కోట్లు అప్పు చేసి ఖర్చు పెడితే అది రాజ్యాంగ బద్ద పాలన ఎలా అవుతుంది? ఆ అప్పు తీర్చడానికి మిగతా ప్రాంతాల వారు కొన్ని సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుందన్నారు.. అయితే, సంపదని అన్ని వర్గాలకు సమానంగా పంచితేనే రాజ్యాంగ బద్ద పాలన అవుతుందన్నారు ధర్మాన.
Read Also: Karimnagar: మున్సిపల్ అధికారులకు షాక్.. ఇంటి పన్ను వెనక్కి ఇవ్వండంటూ
రాజధాని ఒక చెరువులా తయారైతే దాన్ని చూపించకుండా చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందన్నారు ధర్మాన.. గత 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా రైతులు కొట్టుకోవడం చూసామా? అని ప్రశ్నించారు.. చదువు ఒక్కటే పేద కుటుంబాన్ని నిలబెట్టగలదు అని నమ్మిన వ్యక్తి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. అందుకే, పేద విద్యార్థులు చదువుకునేందుకు విలువగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు.. అది ఇప్పటి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది.. దానిపై మనం పోరాడాలి అని పిలుపునిచ్చారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.
Read Also: Canada: ఖలిస్తానీల బరితెగింపు.. భారత కాన్సులేట్ ముట్టడిస్తామని హెచ్చరిక..
మరో వైపు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాట్లాడుతూ.. వైసీపీ అంటే పేదవారి అభివృద్ధి కోసం పని చేసే పార్టీ అన్నారు.. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించే వరకు ఎస్సీ సామాజికవర్గం పని చేస్తుందని ప్రకటించారు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకు దళితులందరూ ఏకతాటిపైకి వచ్చి పని చేయాలని పిలుపునిచ్చారు.. అయితే, దళిత కులంలో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా? అని అన్న చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఏ దళితుడైనా అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు సుధాకర్‌బాబు..