ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కంచికచర్ల పట్టణంలోని వసంత కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ.. ఓటర్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మొండితోక జగన్ మోహనరావుకు ప్రజలు దగ్గర నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది.
Read Also: Aravind Kejriwal : ఢిల్లీ సీఎంకు మద్దతుగా ఆప్ నేతలు… వాక్ ఫర్ కేజ్రీవాల్ పేరుతో పాదయాత్ర
ఇక, మరోసారి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని సీఎంని చేసుకోవాలంటూ నందిగామ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. ఇక, రెండోసారి మా ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందన్నారు. నందిగామ నియోజకవర్గంలో మళ్లీ మేం గెలిచిన తర్వాత, అందరికి మంచినీటి, డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మొండితోక జగన్ మోహన్ రావు హామీ ఇచ్చారు.