ఈ రోజు వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్. నవరత్న హామీలను కొనసాగించనున్నారు. అంతేకాదు.. డీబీటీ పథకాలకు సంబంధించి నగదు పెంపు హామీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు కొత్తగా పారిశ్రామీకరణ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కామెంట్స్‌కు బొత్స కౌంటర్ ఇచ్చారు. రైల్వేజోన్ భూములు, మాఫీయా ప్రభుత్వం వ్యాఖ్యలు చూస్తుంటే గురివింద పూస గుర్తుకు వస్తుందని ఆయన విమర్శించారు. జీవీఎంసీ కమిషనర్ రైల్వేశాఖకు ఇచ్చిన ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ బహిర్గతం చేసిన బొత్స….. 2014లో చేతకాని దద్దమ్మ ను ముఖ్యమంత్రిగా పెట్టుకుని మా మీద ఆరోపణలు చేస్తే ఎలా…? అని ఆయన ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో రైల్వే భూములు అడ్డంకులు తొలగించి భూములు అప్పగించామని ఆయన పేర్కొన్నారు. రైల్వే…
తన సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. పులివెందుల సిద్ధమేనా...? అంటూ ప్రశ్నించిన ఆయన.. నా ప్రాణానికి ప్రాణమైన నా సొంత గడ్డ పులివెందుల.. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీగా అభివర్ణించారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 27న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు యనమల కృష్ణుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.