YS Jagan Key Meeting: ఈ నెల 24వ తేదీన కీలక సమావేశానికి సిద్ధమయ్యారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశం జరగనుంది.. సమావేశానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరుకానున్నారు.. కాగా, ఇప్పటికే వరుసగా సమావేశాలు.. మరోవైపు జిల్లా పర్యటనలతో పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతూ వస్తున్న వైఎస్ జగన్.. ఇంకా వైపు ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కూడా ఉధృతం చేశారు.. అంతేకాదు.. మీరు పోరాడాల్సిన సమయం వచ్చింది.. మీకు అండగా నేను ఉంటాను… జగన్ 2.0 ఎలా ఉంటుందో కూడా వివరిస్తూ వస్తున్నారు.. మరోసారి కీలక సమావేశానికి సిద్ధమైన వైఎస్ జగన్.. ఇప్పుడు భవిష్యత్ కార్యారణపై పార్టీ నేతలకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది..
Read Also: Medchal Wife Murder: కిరాతక మొగుడు కాలయముడయ్యాడు..