నేను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనిషిని అని స్పష్టం చేశారు.. టీడీపీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. 2014 నుంచి నన్ను వైసీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆయన.. మీ వల్ల అది జరగదు.. జరగని పని అని క్లారిటీ ఇచ్చారు. అయితే, పిఠాపురంలో ఓడిపోతామని తెలిసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇలాంటి అబద్ధపు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు..
పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులతో పాటు సుమారు 20 కుటుంబాలు వైసీపీలో చేరాయి.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. అయితే, దేశవ్యాప్తంగా టైటిలింగ్ యాక్ట్ అమలులోకి వస్తే అప్పుడు ఆలోచిస్తాం అన్నారు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంపై ఘాటుగా స్పందించారు..
సూపర్ 6.. సూపర్ 7.. బెంజ్ కార్ హామీలు నమ్మితే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్టే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బాబా అధికారంలోకి వస్తే వర్షాలు రావు.. రిజర్వాయర్లు ఖాళీ అవుతాయని వ్యాఖ్యానించారు.
ఇవాళ చోడవరం, పి.గన్నవరం, పొన్నూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు సీఎం జగన్. ఈ రోజు ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం పార్లమెంట్ పరిధిలోని పి.గన్నవరం నియోజకవర్గంలో ఉన్న అంబాజీపేట బస్టాండ్ రోడ్డులో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్ జగన్.
పులివెందులలో సీఎం జగన్ తరఫున ఆయన సతీమణి వైఎస్ భారతి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గడపగడపకు వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. వైసీపీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వైఎస్ భారతి వివరిస్తున్నారు.
రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్లు మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని.. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనని విమర్శించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ మోసపోవడమేనని ఆరోపించారు.