టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముఖ్య ఉద్దేశం ఏంటని ఢిల్లీలో మీడియా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారని.. ఏపీలో గూండా గిరి, నేరస్తులను అరికట్టడానికే పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో అవినీతిని అంతమొందించేందుకు పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో భూకబ్జాలు అడ్డుకోవడానికి పొత్తు పెట్టుకున్నాం అని వెల్లడించారు. మరోవైపు.. ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.. ఏపీ రాజధానిగా అమరావతిని చేస్తామని స్పష్టం చేశారు అమిత్ షా
ఇంకా అమలులోకి రాని చట్టాన్ని చంద్రబాబు రద్దు చేస్తాడట అని ఎద్దేవా చేశారు వేణుగోపాలకృష్ణ... తన పరిధిలో లేని రిజర్వేషన్లను ముందు పెట్టి కాపులను మోసం చేశాడన్న ఆయన.. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీతో చెప్పించగలరా ..? అని సవాల్ విసిరారు.
తొలి వీడియోలో తన తండ్రి ఛాలెంజ్‌ను తప్పుబట్టిన ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి.. ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం మన అదృష్టంగా పేర్కొన్న ఆమె.. పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి అధికారం లేకపోయినా సమస్యల పట్ల పవన్ కల్యాణ్ స్పందించారు.. అటువంటి నాయకుడు అసెంబ్లీలో ఉంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో…