ఏపీలో రాజకీయ మాటల యుద్ధం నడుస్తోంది. ఒకవైపు టీడీపీ వర్సెస్ వైసీపీ, మరోవైపు వైసీపీ వర్సెస్ జనసేన. ఇలా మాటల కోటలు దాటుతున్నాయి. తాజా ఏపీలో మద్యం అమ్మకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం. చిన్న గమనిక: సారా బట్టీలు,బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే అంటూ ట్వీట్…
ఏపీలో తూర్పుగోదావరి రాజకీయాలు గోదావరి అంత ప్రశాంతంగా వుండవు. తుఫాన్ వచ్చినప్పుడు లంక గ్రామాల్ని ముంచేసినట్టుగా అక్కడ రాజకీయాలు హాట్ హాట్ గా వుంటాయి. తాజాగా జనసేన-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంగళగిరిలో జరిగిన జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి దాడిశెట్టి రాజా కౌంటరేశారు. అంబేద్కర్ జిల్లా ప్రకటించినందుకు పవన్, చంద్రబాబు అల్లర్లు సృష్టించారన్నారు. మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు తగలబెట్టి చంద్రబాబు, పవన్ ఆ మంటల్లో చలికాసుకున్నారు. కోనసీమ అల్లర్లలో…
మంగళగిరిలో జరుగుతున్న జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికల తేవాలనే ఉద్దేశ్యంతోనే కోనసీమలో కుట్ర పన్నారన్నారు నాదెండ్ల.వచ్చే నెలలో పులివెందులలో పవన్ పర్యటన వుంటుందన్నారు. ప్రభుత్వమే కోనసీమలో కులాల చిచ్చు పెట్టింది.కోనసీమ ఘటనపై ఇప్పటి వరకు సీఎం జగన్ స్పందించ లేదు.కోనసీమలో శాంతి నెలకొనాలనే అప్పీల్ కూడా చేయలేదు.ముందస్తు ఎన్నికలు తేలవాలనే వ్యూహంలో భాగంగానే కోనసీమ…
కోనసీమలో జరిగిన సంఘటన చాలా సున్నితమయిన అంశం అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మీడియాతో పవన్ కళ్యాణ్ చిట్ చాట్ నిర్వహించారు. కోనసీమలో తాజా పరిస్థితేంటని మీడియా ప్రతినిధులను ఆరా తీశారు పవన్. మంత్రి పినిపె విశ్వరూప్ కూడా బాధితుడేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ఎపిసోడ్ సెన్సిటివ్‌గా ఉందనే విషయాన్ని కేంద్ర నిఘా విభాగం ముందుగానే అలెర్ట్ చేసింది. అయినా ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదన్నారు. కేంద్రం అలెర్ట్ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించ లేదని…
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏ విషయం మీదనైనా చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు. తనదైన రీతిలో స్పందిస్తూ వుంటారు. ఆయన రూటే సపరేటు. అంతా వివిధ సమస్య గురించి మాట్లాడితే.. మొన్నామధ్య బిగ్ బాస్ గురించి విమర్శలు చేశారు. తిరుపతిలో నారాయణ ఏపీ రాజకీయాలపై స్పందించారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చును అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు స్వాగతిస్తున్నా అన్నారు. బీజేపీ ఎలా వైసీపీకి వ్యతిరేకంగా రోడ్ మ్యాప్ ఇస్తుంది. వైసీపీ, బీజేపీలు లివింగ్ టు గెథర్…