కోనసీమలో జరిగిన సంఘటన చాలా సున్నితమయిన అంశం అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మీడియాతో పవన్ కళ్యాణ్ చిట్ చాట్ నిర్వహించారు. కోనసీమలో తాజా పరిస్థితేంటని మీడియా ప్రతినిధులను ఆరా తీశారు పవన్. మంత్రి పినిపె విశ్వరూప్ కూడా బాధితుడేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ఎపిసోడ్ సెన్సిటివ్‌గా ఉందనే విషయాన్ని కేంద్ర నిఘా విభాగం ముందుగానే అలెర్ట్ చేసింది. అయినా ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదన్నారు.
కేంద్రం అలెర్ట్ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించ లేదని విమర్శించారు పవన్. ప్రభుత్వమే కుట్ర పన్నిందనడానికి కారణాలు లేకపోలేదు. కోనసీమ ఘటన జరిగి ఇన్నాళ్లు అయినా ప్రభుత్వం స్పందించకపోవడం చూస్తుంటే అనుమానాలు బలపడుతున్నాయి.సీఎం జగన్ ఇప్పటి వరకు కోనసీమ ఘటనపై నోరెత్తకపోవడం.. డీజీపీ ఇప్పటి వరకు ఫీల్డులోకి వెళ్లకపోవడం చూస్తుంటే కోనసీమ ఘటనలో రాజకీయం ఉందని మేం భావిస్తున్నాం అన్నారు పవన్.
కోనసీమ ఘటన విషయంలో ప్రభుత్వ కుట్రకు మంత్రి పినిపె విశ్వరూప్ బాధితుడయ్యారన్నారు. నాకు తెలిసినంత వరకు విశ్వరూప్ మంచి వ్యక్తే.రాజకీయాల కోసం రెచ్చగొట్టే స్వభావం ఉన్న వ్యక్తి విశ్వరూప్ కాదనేది నా భావన. జనసేన కార్యకర్తలు కోనసీమ ఘటనలో ఉన్నారని ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి.. విశ్వరూప్ కొడుకు ఆడియో క్లిప్పింగ్ కూడా ట్వీట్ చేస్తే బాగుంటుందన్నారు. నేనెప్పుడన్నా ఢిల్లీ వెళ్లినప్పుడు మంత్రి విశ్వరూప్ కొడుకు ఆడియోను కూడా ట్వీట్ చేయమని విజయసాయి రెడ్డికి నేను చెబుతా అన్నారు.
మంత్రి విశ్వరూప్ కొడుకు మాటల ద్వారా కోనసీమ ఘటన వెనుక వైసీపీ నేతలే ఉన్నారని అర్ధం కావడం లేదా..? కోనసీమ ఘటనలో ప్లస్.. మైనస్ అని ఏ రాజకీయ పార్టీ ఆలోచించకూడదు.ఇలాంటి ఘటనల్లో ప్లస్ వచ్చినా మేం తీసుకోం.ఇంత గొడవలు జరుగుతోంటే.. వైసీపీ నేతలు బస్ యాత్ర చేయడం అవసరమా..?ఓ చిన్న మీటింగుకు మేం హాజరవుతామంటేనే గతంలో పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు.
వేల సంఖ్యలో తరలివస్తోంటే పోలీసులు ఏం అయ్యారో..?ఫైరింజన్ ఎందుకు రాలేదో ఆశ్చర్యంగా ఉంది.కోనసీమ వ్యవహారాన్ని రాజకీయ కోణంలోనే ప్రభుత్వం చూసినట్టుగా ఉంది.అంబేద్కర్ పేరును రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప.. చిత్తశుద్ధి లేనట్టుగా కన్పిస్తోంది.కోనసీమలో ఇష్యూ సెన్సిటీవ్ అనే విషయాన్ని తెలిసినప్పుడు పోలీసులు అలెర్టుగా ఉండాల్సింది అన్నారు పవన్.
LIVE: ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్