జూలై 8, 9 తేదీల్లో నిర్వహించే వైసీపీ ప్లీనరీకి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో గ్రౌండ్‌ను వైసీపీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మండలి చీఫ్ విప్, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వైసీపీ ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని.. పార్టీ నేతలందరూ ఏం చేయాలి, విధి విధానాలు ఎలా ఉండాలి అన్న చర్చ ప్లీనరీలో జరుగుతుందని తెలిపారు. భవిష్యత్‌లో జరిగే కార్యక్రమాలకు సంబంధించి…
చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, వేంకటేష్ గౌడ, జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల గత రెండేళ్లు వైసీపీ ప్లీనరీ జరుపుకోలేకపోయామని..జూలై…