MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఈరోజు ఉదయం తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరులోని ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సిట్ అధికారులు రైడ్స్ చేపట్టారు.
అన్నమయ్య జిల్లా వాల్మీకి పురం వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా ఇవే తన చివరి ఎన్నికలు కావచ్చని.. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానేమో అని ఎంపీ మిథున్ రెడ్డి తన మనస్సులోని మాటను తెలిపారు.
ప్రజల, రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా పార్లమెంట్‌లో మా విధానం ఉంటుందని వైసీపీ ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశాల పూర్తి అజెండాపై ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలకు మార్గనిర్దేశం చేశారని తెలిపారు.