Ambati Rambabu Slams TDP:164 సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు జగన్ నామ జపం చేస్తున్నారని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.. తాజాగా అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీల ప్రక్రియ సంగతి మర్చిపోయి జగన్ కట్టడి కోసం పనిచేస్తున్నారని.. చిట్టి నాయుడు దెబ్బకు చంద్రబాబు బుర్ర కూడా పోయిందన్నారు.. జగన్ ను ఆపటం మీ తరం కాదు.. జగన్ వస్తే విపరీతంగా జనం వస్తున్నారని మీరే ప్రచారం…
వైయస్సార్ కడప జిల్లాకు సేవచేసి అభివృద్ధి పథంలో నడిపించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. అటువంటి మహనీయుడు విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా? అని ప్రశ్నించారు. సున్నితంగా ఇది తప్పు అని పోలీసులకు అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో అక్కడి ప్రజలు ఆ జెండాలను పక్కన పెట్టారని తెలిపారు. ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులపై…
Damodara Raja Narasimha : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు, వర్గపోరు లాంటివి సహజమని, కానీ అవి పార్టీకి నష్టం కలిగించకూడదని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలంటే చాలాసేపు పడుతుందని, మన పార్టీ బలమే స్వేచ్ఛ, అదే బలహీనత కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్‌లో సంభవించిన గందరగోళ పరిస్థితులపై స్పందించిన దామోదర్ రాజనర్సింహ, అక్కడ ఎంపీ సురేష్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఉన్నా కూడా వివాదం చోటు చేసుకోవడం…
Vellampalli Srinivas Rao : ప్రతిపక్షంలో ఉండగా కరెంట్ చార్జీలు పెంచమని ప్రతీ వీధికి వెళ్లి తిరిగి మరీ చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలపై పెనుభారం మోపారని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ఈనెల 27వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలసి నిరసన ర్యాలీలు చేపడుతున్నామన్నారు.. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా గడవక ముందే 15,485 కోట్ల భారం మోపారన్నారు. విద్యుత్…
Ponguleti Srinivas Reddy : వరంగల్‌ను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే రాబోయే తరాలకు ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్మకొండలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, వరంగల్ అభివృద్ధి కోసం అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించామని వివరించారు. వరంగల్ చుట్టూ 3 విడతల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ జిల్లాకు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5,213…