ముద్రగడ పద్మనాభం వైసీపీ లో చేరిక వాయిదా పడింది. గతంలో రేపు వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాలతో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఇక, ఈ నెల 15 లేదా 16 ముద్రగడ ఫ్యామిలీ మాత్రమే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గా సాగుతోంది.. సీఎంవో నుంచి నేతలకు ఫోన్లు వెళ్లడం.. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆశావహులు ఇలా నేతలు సీఎంవోకు క్యూ కడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల్లోను టెన్షన్మొదలైంది.. దానికి ప్రధాన కారణం.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్థాలచలనం కలగడమే.. మరికొందరికి అయితే, సీటు కూడా కష్టమని అధిష్టానం నుంచి క్లారిటీగా సందేశాలు వెళ్లాయి.