YS Jagan: తిరుపతిలో ఇంజినీరింగ్ చదవుతున్న దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.
మేయర్ అవిశ్వాస పరీక్ష ముందు వైసీపీకి మరో షాక్ తగిలింది.. పార్టీకి రాజీనామా చేశారు 6వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక.. ఆమె, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె కావడం ఇక్కడ చర్చగా మారింది..
ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం, 2025 అమల్లోకి వచ్చింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 8 నుంచే ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఈ బిల్లు పాస్ అవ్వగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్ (సవరణ) బిల్లు చట్టంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం గెజిట్…
ఆంధ్రప్రదేవ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైసీపీ నేతల బృందం కలిసింది. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు, అక్రమ కేసులు, వ్యవస్థల నిర్వీర్యంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు విడదల రజినీ.. వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు.
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైయస్ జగన్‌ను గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు కలిశారు. దాదాపు 400 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల కుటుంబాలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ బహిష్కరణ వేటు వేశారు. బహిష్కరించిన వారిలో అన్ని కుటుంబాలు మైనారిటీ, ఎస్సీ, బీసీలకు చెందినవే ఉన్నాయి. కాగా.. వచ్చే రెండు నెలల్లో ఛలో పిన్నెల్లి కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతుంది. ఈ క్రమంలో.. గ్రామ బహిష్కరణ విషయంపై…
ఏకంగా 13.4 శాతానికి అప్పులు తీసుకొచ్చారు.. వీళ్లని ఏమనాలి..? అంటూ ఫైర్ అయ్యారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. బడ్జెట్‌పై రిప్లై ఇస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ సమాజానికి హానికరం అంటూ వ్యాఖ్యానించారు.. సిగరెట్ పెట్టెల మీద స్టాట్యూటరీ వార్నింగ్ ఇచ్చినట్లు.. వైసీపీ సమాజానికి హానికరం అంటూ పదే పదే చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు..
Chelluboyina Venu: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రెడిబిలిటీ కోల్పోయింది అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చారు.. తొమ్మిది నెలల పాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసిన మోసం అర్థమైపోయిందన్నారు.
మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ వ్యవహార శైలి మార్చుకోవడం లేదని పార్టీలో అందరూ మారుతున్నారని తెలిపారు. సంక్రాంతి కేవలం కూటమి నాయకులకే అని వైసీపీ నేతలంటున్నారు.. సంక్రాంతి ఎవరికో అవగాహన లేకుండా, క్షేత్రస్థాయిలో అంశాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఈ రోజు జనసేన పార్టీలో చేరారు వైసీపీ నేతలు.. ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ, ఆప్కో మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి. ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో.. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.. వారికి పార్టీ కండువా వేసి జనసేనలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్..