Pamidi Samanthakamani: వైసీపీకి మరో షాక్.. పార్టీకి మాజీ మంత్రి రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pamidi Samanthakamani: ఎన్నికల వేళ అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచుతున్న వేళ.. కొన్ని పార్టీలకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. అనంతపురం జిల్లాకు చెందిన నేత మాజీ మంత్రి, మాజీ ఎమ్మల్సీ శమంతకమణి, ఆమె కుమారుడు ఆశోక్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.. ఈ మధ్యే శమంతకమణి కూతురు యామినీబాల.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పగా.. ఈ రోజు తన కుమారుడు అశోక్‌తో పాటు వైసీపీకి బైబై చెప్పారు శమంతకమణి.. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. 1980లో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇక, 1989-1991 వరకు మంత్రిగా సేవలు అందించారు.. ఆ తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు.. ఇక, 2014లో తన కూతురు యామినీబాలకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు.. కానీ, 2019 నాటికి రాజకీయాలు మారిపోయాయి.. సింగనమల నియోజకవర్గ టికెట్ మరోసారి వారికి దక్కకుండా పోవడంతో.. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్ సమక్షంలో శమంతకమణి, యామినీబాల, అశోక్ వైసీపీలో చేరారు.. కాగా, ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి శింగనమల టికెట్ ఆశించి భంగపడ్డారు యామినీ బాల.. దీంతో, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె.. ఈ మధ్యే వైసీపీకి రాజీనామా చేశారు..
Read Also: Allu Arjun Secret Diet: అల్లు అర్జున్ ఫిట్‌నెస్ రహస్యం ఇదే.. మీరూ ట్రై చేయొచ్చు..
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
కాగా, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శింగనమల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు యామినీ బాల.. అప్పుడు ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది.. కానీ, 2019 ఎన్నికల్లో అప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న యామినిబాలకు బదులు కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి అవకాశం కల్పించారు చంద్రబాబు.. ఇక, తన కుమార్తెకు టికెట్ కోసం చివరి వరకు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శమంతకమణి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.. దీంతో.. టీడీపీకి ఎమ్మెల్సీగా ఉన్న శమంతకమణి, ఆమె కూతురు మాజీ ఎమ్మెల్యే యామిని బాల.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. టీడీపీకి రాజీనామా చేసి.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.. ఇప్పుడు వైసీపీ టికెట్ దక్కకపోవడంతో.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. తమ రాజకీయ భవిష్యత్తుపై వారు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు అనేది వేచాచూడాలి.
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!