YSRCP and TDP Rebel MLAs: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నలుగురు వైసీపీ, మరో నలుగురు టీడీపీ రెబల్స్‌పై నిర్ణయం తీసుకోనున్నారు స్పీకర్.. నిన్న స్పీకర్ ముందు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.. ఇప్పటికే వివరణకు మూడు సార్లు అవకాశం ఇచ్చారు స్పీకర్.. అయితే, నిన్న స్పీకర్ ముందు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు.. టీడీపీకి చెందిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా హాజరుకావాల్సి ఉండగా.. ఒక వాసుపల్లి గణేష్ మాత్రమే వచ్చారు.. తమ వాదన వినిపించడానికి నాలుగు వారాల సమయం కావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోరారు..
Read Also: Student Suicide: కరీంనగర్ లో ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
మరోవైపు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దుచేయకూడదో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ జారీచేసిన నోటీసులపై ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. మండలి ఛైర్మన్ నోటీసును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య వేసిన పిటిషన్ పైనా.. విచారణ సాగింది.. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.. అయితే, రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఇవాళ స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. రెబల్ ఎమ్మెల్యేలు అందరిపై వేటు పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. మొత్తంగా రాజ్యసభ ఎన్నికలకు ముందు జరుగుతోన్న ఈ పరిణామం కీలకంగా మారింది..