YSR 76th Birth Anniversary: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి (జూలై 8) ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్ఆర్‌సీపీ విక్టోరియా కన్వీనర్ మర్రి కృష్ణ దత్తారెడ్డి, కో-కన్వీనర్ భరత్, సభ్యులు సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బ్రహ్మ రెడ్డి, రామంజీ, నాగార్జున పాల్గొన్నారు.
Read Also: Dalai Lama: ఎలా చైనా జనరల్ ఆహ్వానం, దలైలామా భారత్ పారిపోయి వచ్చేలా చేసింది..?
ఈ సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, పార్టీ నాయకులు కాసు మహేష్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పాల్గొన్నారు. ఇక, వారు మాట్లాడుతూ.. వైఎస్సార్ చేసిన పనులు అన్నీ మరొకసారి గుర్తు చేసుకుకున్నారు. కాగా, వైఎస్ జగన్ తండ్రిని మించిన పాలన అందించారని, వ్యవసాయం, విద్యా, వైద్య రంగాల్లో ఎన్నో సంస్కరణలు చేశారని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమం అందించడంతో పాటు రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడలేదన్నారు.
Read Also: Vikarabad: చిన్న పిల్లాడివి.. మద్యం తాగొద్దని చెప్పినందుకు కొడవలితో దాడి..
ప్రజాసేవకులుగా ఎవరికి, ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా అందుబాటులో ఉండి ప్రజలందరికీ కూడా అండదండలు అందించడం జరుగుతుందని వైఎస్ఆర్ పార్టీకి మద్దతిచ్చిన కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వైసీపీకి అండగా ఉన్న వారి తరపున పోరాడతామని, వైస్సార్‌సీసీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటాం.. ప్రజాసేవలో మమేకం అవుతూ.. ఎప్పటిలాగే ప్రజల్లో ఉంటామన్నారు. పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా అధైర్యపడొద్దని తెలిపారు.