వివేకా హత్య కేసులో కీలక సమాచారం అందించినవారికి సీబీఐ రూ.5 లక్షలు నజరానా ప్రకటించడంపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తామనడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. వివేకాను చంపింది ఎవరో పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీలను అడిగితే చెబుతారని రామకృష్ణ పేర్కొన్నారు. ఏళ్లతరబడి విచారణ చేస్తున్న కేసు పూర్తికాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా అంశాలపై…
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం రఘునాధ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మొదటిసారిగా రఘునాధ్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇతను సీఎం క్యాంపు కార్యాలయ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ రాష్ట్రకార్యదర్శి శివశంకర్‌రెడ్డిని 7 గంటల పాటు సీబీఐ విచారించింది. గతంలో కూడా శివశంకర్‌రెడ్డిని సిట్, సీబీఐ బృందాలు ప్రశ్నించాయి. ఈ కేసులో కీలక సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. మరోవైపు డాక్టర్ భరత్ రెడ్డిని కూడ సీబీఐ అధికారులు…
ఏపీలో రెండేళ్ల క్రిందట సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎట్టకేలకు అరెస్టుల పర్వం మొదలైంది. ఈ కేసులో సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసిన సీబీఐ… అతన్ని పులివెందుల మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచింది. కోర్టు సునీల్ యాదవ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సీబీఐ సునీల్ యాదవ్ ను కడప సెంట్రల్ జైలు అధికారులకు అప్పగించింది. అయితే సునీల్ యాదవ్ ను మరింత విచారించేందుకు…