వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం రఘునాధ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మొదటిసారిగా రఘునాధ్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇతను సీఎం క్యాంపు కార్యాలయ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ రాష్ట్రకార్యదర్శి శివశంకర్‌రెడ్డిని 7 గంటల పాటు సీబీఐ విచారించింది. గతంలో కూడా శివశంకర్‌రెడ్డిని సిట్, సీబీఐ బృందాలు ప్రశ్నించాయి. ఈ కేసులో కీలక సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. మరోవైపు డాక్టర్ భరత్ రెడ్డిని కూడ సీబీఐ అధికారులు విచారించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు కీలకమైన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. మరోవైపు శివశంకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మణికంఠరెడ్డిపై వివేకా కుమారై సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also : యంగ్ హీరో నిఖిల్ కు కమిషనర్ ప్రశంసలు
Also Read
ఈ నెల 10న ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్ తరువాతి డోర్ దగ్గర ఆగి ఫోన్ కాల్స్‌చేశాడని కంప్లైంట్ చేశారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని సునీత కోరారు. 2019 మార్చి 14వ తేదీ రాత్రి తన ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి పలువురి అనుమానితుల పేర్లను కూడ సీబీఐకి అందించింది. రెండేళ్లుగా ఈ కేసులో నిందితులను గుర్తించకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సీబీఐ ఉన్నతాధికారులకు ఆమె వినతిపత్రం సమర్పించారు.ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. 68 రోజులుగా సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!