వైఎస్ వివేక మృతి కేసులో సోమవారం విచారణకు రాలేనని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కేంద్ర దర్యాప్తు బృందానికి లేఖ రాశారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేనందుకు విచారణకు రాలేకపోతున్నాను అంటూ తెలిపారు. తన తల్లి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక విచాణకు వస్తానని ఆయన వెల్లడించారు. తనకు 10 రోజుల గడువు ఇవ్వాలంటూ ఆ లేఖలో కోరారు. అవినాశ్ రెడ్డి విజ్ఞప్తిపై సీబీఐ ఇంకా స్పందించలేదు. వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ నెల 19న సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఆ రోజు కూడా వెళ్లలేకపోయారు. ఆయన తల్లికి ఆరోగ్యం బాగోలేదని హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్లారు.
Also Read : Music Director Koti: మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటారు..
అవినాశ్ తల్లి ఛాతీ నొప్పితో పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ నెల 19న అవినాశ్ విచారణకు రాకపోవడంతో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు పంపి సోమవారం విచారణకు రావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అవినాశ్ ఇవాళ సీబీఐకు లేక రాసి తాను రాలేకపోతున్నానని చెప్పారు. అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే విచారించింది. ఈ కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటపడుతున్నాయి.
Also Read : Naresh: నా ఆస్తి 1000 కోట్లు కంటే ఎక్కువే.. అంతా బ్లాక్.. ?