తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో పదేళ్లుగా సాగింది సమగ్ర,సమీకృత,సమ్మిళిత,సమతుల్య అభివృద్ధి కాదు కేటీఆర్ గారు.”అవినీతి,దోపిడీ,దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన”. ఆఫ్గనిస్తాన్ ను తలపించిన తాలిబాన్ల పాలన.5 లక్షల కోట్లు అప్పులు చేసి,ఒక్కో నెత్తిమీద 2 లక్షల అప్పు మోపి తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని ప్రజెంటేషన్లు ఇచ్చుకోవడానికి సిగ్గుండాలే. Also Read: TS Weather:…
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న ఐటీ దాడులపై వైఎస్ షర్మిలా స్పందించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడని మండిపడ్డారు. ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ము లేక అధికారాన్ని వాడుకుని కేసీఆర్ ఐటీ దాడులకు పాల్పడుతున్నాడన్నారు. Also Read: YSRCP: జనసేనకు బిగ్‌షాక్.. వైసీపీలో చేరిన జనసేన కీలక నేతలు ఎన్నికల్లో…
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ, వైఎస్సార్‌టీపీ తప్పుకున్నాయి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో పోటీ వద్దని చెప్పడంతో కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర అసంతృప్తికి లోనై ఆ తర్వాత బీఆర్ఎస్‌లోకి అనుచరులతో చేరిన విషయం తెలిసిందే.
తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన ఆమె ఇప్పుడు పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని వైఎస్ ఆర్ టీపీ నిర్ణయించిందన్నారు.
Sharmila: వైయస్ షర్మిల గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న షర్మిల ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమస్ గా మారింది.
వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటీషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని షరతులను ఈ సందర్బంగా కోర్టు సూచించింది. రూ.30 వేలు, ఇద్దరు పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఇక షర్మిల విదేశాలకు వెళ్లాలనుకుంటే కోర్టు అనుమతి తప్పనిసరని తెలిపింది.