విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ కలిసిన విషయం తెలిసిందే. విజయవాడలో మాజీ సీఎంను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇంతలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో నారాయణ దాఖలు చేసిన కేసుకు సంబంధించి వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కౌంటర్ దాఖలు చేసేందుకు మంత్రి నారాయణ తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూద్రా సమయం కోరా�
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సెటైర్లు విసిరారు. తనకు నమస్కారం పెట్టేందుకు ఇష్టం లేకనే జగన్ అసెంబ్లీలోకి రావడం లేదని అన్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్వాగతం పలికారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే త్వరలో శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరిగే అవకాశం ఉంది. వైసీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. నాకు అనుభవం ఉంది.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందన్నారు. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడు అయ్యింది.. ప్రజాగళంకు వారాహి తోడు అయ్యింది.. సైకిల్ స్పీడుకు తిరుగు లేదు.. గ్లాసు జోరుకు అడ్డు లేదు అని పేర్కొన్నారు.
ఇవాళ్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ కార్డులో క్యూ ఆర్ కోడ్, లద్ధిదారుని ఫోటో, లబ్ధిదారుని ఆరోగ్య వివరాలు ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
నేటి నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనుంది ఏపీ సర్కారు. ఇవాళ్టి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.