ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే త్వరలో శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరిగే అవకాశం ఉంది. వైసీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ అవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను తెలుసుకోబోతున్నారు.
లేపాక్షిలో ఉత్సవాలను మళ్లీ పునః ప్రారంభిస్తాం... అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నారు హిందూపురం ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ.. వరుసగా మూడోసారి గెలిచి హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య.. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలోని తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడోసారి ముచ్చటగా గెలిపించినందుకు హిందూపురం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు..
Ys Jagan Tweets about Situation in Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది, టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది అని ఆరోపించిన ఆయన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని అన్నారు. పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు…
సోషల్ మీడియా వేదికగా గవర్నర్కు విజ్ఞప్తి చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఏపీలో ఫలితాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. కూటమికి భారీ ఎత్తున సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం చతికల పడింది. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజీనామా చేశారు.