YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. ముఖ్యంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి టీడీపీ కూటమి శ్రేణులు దాడులు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.. అయితే, ఈ నేపథ్యంలో.. సోషల్ మీడియా వేదికగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ”రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్ గారు @governorap వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం.” అంటూ ట్వీట్ (ఎక్స్‌లో పోస్టు) చేశారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
ఇక, అంతకుముందు వైఎస్ జగన్ తో సమావేశం అయ్యారు పార్టీ నేతలు.. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు.. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు గవర్నర్ ను కలవనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.. కౌంటింగ్ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
వైఎస్ జగన్ తాజా ట్వీట్..
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు,…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2024