ఏపీ ప్రజలకు మంచి చేయాలన్నదే తమ లక్ష్యం అని అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. విధ్వాంసానికి గురైన ఏపీని ఎలా బాగు చేయాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు. అప్పుడే కొందరు పారిపోవాలని చూస్తున్నారని, వారికి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వాలన్నారు. గెలిచిన వారి నుంచి ఫోన్లు వస్తున్నాయని, వారిని రానిచ్చే పరిస్ధితి లేదని సీఎం రమేష్ పేర్కొన్నారు. అనకాపల్లి లోక్‌సభ నుంచి సీఎం రమేష్ గెలుపు దాదాపుగా ఖాయం అయింది.
సీఎం రమేష్ మాట్లాడుతూ… ‘పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇది ఈవీఎంల నుంచి వచ్చిన మెజార్టీనే. ఇది కొందరు గ్రహించాలి. ఒక్క ఛాన్స్ అని వైఎస్ జగన్ అడిగి ప్రజలను మోసం చేశారు. వై నాట్ 175 ఏమైంది.. 175లో 5 తీసేశారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జగన్ విధ్వంసం సృష్టించారు. రాజధానిని విధ్వంసం చేసేశారు .రుషికొండను విధ్వంసం చేశారు. ఇది జగన్ గారికి మామూలు శిక్షకాదు. గెలిచిన వారి నుంచి ఫోన్లు వస్తున్నాయి. వారి రానిచ్చే పరిస్ధితి లేదు. ఎంత మందిని ఏడిపించారు. ఇంట్లో ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడారు. ఏపీ ప్రజలకు ఏ విధంగా మంచి జరగాలన్నదే మా లక్ష్యం. విధ్వంసానికి గురైన ఏపీని ఎలా బాగుచేయాలన్నదే నా ఆలోచన. అప్పుడే కొందరు పారిపోవాలని చూస్తున్నారు. వారికి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వాలి’ అని అన్నారు.