నేటి నుంచి జగన్ క్యాంప్ ఆఫీస్లో వైసీపీ కార్యాలయం. ఇప్పటివరకు తాడేపల్లిలో నడిచిన వైసీపీ కేంద్ర కార్యాలయం. కొత్త ఆఫీస్ నుంచే నేటి నుంచి వైసీపీ కార్యకలాపాలు. పారిస్ ఒలింపిక్స్లో నేడు సెమీఫైనల్ ఆడనున్న భారత హాకీ జట్టు. ఈ రోజు రాత్రి 10.30 గంటలకు హాకీ సెమీ ఫైనల్. జర్మనీతో తలపడనున్న భారత హాకీ జట్టు. తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,570 లుగా ఉండగా.. 22 క్యారెట్ల…
YS Jagan: ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండు నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారు పేరుగా మారిపోయింది అన్నారు.
AP Govt: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే హౌసింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగనున్నారు.. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన జగన్.. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.. ఆ తర్వాత బొత్సను తమ అభ్యర్థిగా ప్రకటించారు వైఎస్ జగన్..
5న కలెక్టర్ల కాన్ఫరెన్స్.. వీటిపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్కు సిద్ధం అవుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 5వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.. ఈ సమావేశానికి మంత్రులు హాజరుకానున్నారు.. సచివాలయంలో ఈ నెల ఐదో తేదీన జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణ ఏర్పాట్లపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా…
గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడమే కాకుండా.. అప్పులు చేసి పెట్టింది.. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అప్పులే కనిపిస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొంగూరు నారాయణ..
మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు.. ఏపీకి ప్యాకేజ్ లభిస్తే తెలంగాణ ప్రభుత్వం వైఖరి కక్ష సాధింపు ధోరణికి నిదర్శనంగా ఉందన్న ఆయన.. కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోంది..? అంటూ ఫైర్ అయ్యారు.. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదు అని విమర్శించారు
వైసీపీకి రాజీనామా చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.. టీడీపీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట.. ఇటీవలే వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్కు పంపిన ఆయన.. గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.. గతంలో ఆయన టీడీపీలో మంత్రిగా ఉన్న సమయంలో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ద్వారా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు రాయబారాలు పంపుతున్నారట..