గత ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచింది. మైండ్ ఉండే ఎవ్వడూ ఈ తరహాలో ఎక్సైజ్ పాలసీ రూపొందించరు అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు.. ఏం చేసినా జరిగిపోతోందనే అహకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. పాత బ్రాండ్లను తప్పించారు.. కొత్త బ్రాండ్లను తెచ్చారని ఫైర్ అయ్యారు
Home Minister Anitha: ఢిల్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్ ధర్నాపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు సిద్దాంతాలు ఉంటాయి.. కానీ వైసీపీకి అబద్ధపు, ప్రచారాలు నంగనాచి కబుర్లు చెప్పడమే సిద్దాంతం.. వై నాట్ 175 అని కబుర్లు చెప్పి 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ అని ఆరోపించారు.
YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న దాడులు, హింసాత్మక ఘటనలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నాడు. అయితే, జగన్ ధర్నాకు పలు పార్టీలకు చెందిన నేతలు మద్దతు ఇస్తున్నారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే, వైఎస్ జగన్ చేస్తున్న ధర్నాకు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు ఇచ్చారు.. ఆయనతో కలిసి ధర్నాలో కూర్చోని సంఘీభావం ప్రకటించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఢిల్లీలో ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేయనున్నారు.
గడిచిన 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగిన మాట వాస్తవం కాదా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆ నిజం చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడతారంట అంటూ ఆయన మండిపడ్డారు. అందుకు సంబంధించిన ఆధారాలు మాజీ ముఖ్యమంత్రి ఇవ్వాలంట... లేకపోతే కేసులు పెడతారంట ...హోం మంత్రికి ఆ పవర్ ఉంటే కేసులు పెట్టుకోవచ్చని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో సమావేశమయ్యారు. 45 నిమిషాల పాటు గవర్నర్తో జగన్ భేటీ అయ్యారు. ఏపీలో 45 రోజులుగా జరుగుతున్న హత్యలు, దాడులపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
Anagani Satya Prasad: గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసుల మాఫీ కోసమే ఢిల్లీ పర్యటనలు చేశారని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. ఇప్పుడు జగన్ ఢిల్లీ వెళ్ళినా.. గవర్నర్ ను కలిసినా ఎవరూ పట్టించుకోరు.. వినుకొండ పర్యటన, గవర్నర్ ని కలవడం రాజకీయ లబ్ధి కోసమే చేశారు..