విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ మాజీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి వేర్వేరుగు సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి పిటిషన్ పై వాదనలు పూర్తి కాగా, తీర్పు ఈనెల 30కి వాయిదా పడింది.
వెలుగొండ ప్రాజెక్టు పటిష్టతపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెలుగొండ హెడ్ రెగ్యులెటర్ పనుల్లో నాణ్యత లేదని మంత్రి నిమ్మల మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులెటర్ ప్రాజెక్టు పనుల్లో నాణ్యత సరిగా లేదని ఆయన విమర్శించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్వాగతం పలికారు.
సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవడికి వాడు తోపులనుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్లు వాగేయడం.. అందులో ఏదైనా ఒకటి నిజమైతే దాన్ని క్లెయిమ్ చేసుకోవడం.. దోచుకోడవం.. ఇదీ పరిస్థితి. ఇలాంటి వాళ్లకు సోషల్ మీడియాలో కొదువేలేదు. ఇలాంటి వాళ్లలో ముందుంటారు జ్యోతిష్యుడిగా చెప్పుకునే వేణు స్వామి (Venu Swamy Parankusam). వేణు స్వామి జ్యోతిష్యం ఎన్నో సార్లు ఫెయిలైంది. నేను చెప్పింది తప్పయిపోయింది.. క్షమించండి.. ఇంకెప్పుడూ జ్యోతిష్యం చెప్పను అని దండం పెట్టి వెళ్లిపోయారు. కానీ…
వెలిగొండ ప్రాజెక్ట్ పై మాట్లాడే అర్హత మీకు లేదంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.. వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డేనని విమర్శించారు.. ఆనాడు చంద్రబాబు సూచనలతో ప్రకాశం జిల్లా నేతలు అందరం ఢిల్లీ వెళ్లి వెలిగొండ ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రిని కలిశామని గుర్తుచేసుకున్నారు..
బొత్స.. బౌన్స్ బ్యాక్! ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. విశాఖ కేంద్రంగా ఈ మాజీ మంత్రి చక్రం తిప్పనున్నారా..? వైసీపీకి పూర్వవైభవం కోసం ఇదే సరైన నిర్ణయం అని హైకమాండ్ భావిస్తోందా..? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ పరిణామాల వెనుక రీజనేంటి.? వైఫల్యం నేర్పిన పాఠమా లేక.. స్ధానిక నాయకత్వానికి పెద్దపీట వేసే వ్యూహమా…? వైసీపీ అంతర్గత పరిణామాలు వేగంగా మారుతున్నట్టే కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమిపై పోస్ట్ మార్టమ్ తర్వాత వైఫల్యాలను…
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైయస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
మాజీ మంత్రి ఆళ్ల నాని.. వైసీపీకి రాజీనామా చేశారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. కొద్దిరోజుల క్రితం ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు.. నియోజకవర్గ ఇంఛార్జ్ పోస్టుకు రాజీనామా చేశారు ఆళ్ల నాని.. ఇక, ఈ రోజు వ్యక్తిగత కారణాలతో, వ్యక్తిగత బాధ్యతలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
జగన్ కాని.. వైసీపీ ఎమ్మెల్యే లు కానీ.. మీడియాలో మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోరితే సభాపతిగా తాను తప్పకుండా మాట్లాడే అవకాశం ఇస్తానన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు..
కడప జిల్లాలో వైసీపీ అలర్ట్ అయ్యింది.. ఉమ్మడి కడప జిల్లాలోని జడ్పీటీసీలకు అధిష్టానం నుంచి పిలుపు వెళ్లింది.. జిల్లాలోని జడ్పీటీసీలు అందరూ ఈ నెల 21వ తేదీన విజయవాడకు రావాలంటూ ఆదేశాలు వెళ్లాయి..