ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్కు ఊరట లభించింది.. తన పాస్పోర్ట్ రెన్యువల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్.. అయితే, ఐదేళ్ల పాటు పాస్పోర్ట్ను రెన్యువల్ చేయాలని తీర్పు వెలువరించింది హైకోర్టు.. పాస్పోర్ట్ విషయంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన రెన్యువల్ను ఐదేళ్లకు పెంచుతూ తీర్పు ఇచ్చింది ఏపీ హైకోర్టు..
ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ బోట్లను వైసీపీ వాళ్లే కుట్రపూరితంగా వదిలారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో.. మంత్రి నారా లోకేశ్.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వరద బాధితులకు వైయస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విరాళం ప్రకటించారు.. తమ నెల జీతం విరాళంగా ప్రకటించారు వైసీపీ ప్రజాప్రతినిధులు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి..
వైసీపీ అధినేత వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. జగనే రాష్ర్టానికి ఒక పెద్ద విపత్తుగా పేర్కొన్న ఆయన.. జగన్ చేసిన మానవ తప్పిదాల వల్లనే వరదల వల్ల పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగాయన్నారు. ‘మ్యాన్ మేడ్ డిజాస్టర్’లో ఉన్న మ్యాన్ జగన్ రెడ్డే అని దుయ్యబట్టారు
YS Jagan: ఏపీ హైకోర్టులో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే, జగన్ పాస్ పోర్ట్ ఐదేళ్ల పాటు రెన్యూవల్ చేస్తూ.. సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఏపీ హైకోర్టుకు పిటిషనర్ తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. వారికి అందుతున్న సాయంపై ఆరా తీసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ రోజు వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు.. పార్టీ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్.
వైసీపీకి ఇంకో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారా? ఆల్రెడీ ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రిజైన్ చేయగా ఇంకో ఇద్దరు అదే రూట్లో ఉన్నారన్నది నిజమేనా? ఈ రాజీనామాల పరంపరపై పార్టీ అధిష్టానం వైఖరి ఎలా ఉంది? వెళ్ళే వాళ్ళని ఆపే ప్రయత్నం ఏదన్నా జరుగుతోందా? లేక పోతేపోనీ అనుకుంటున్నారా? జంపింగ్స్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? రెండు నెలల క్రితం వరకు ఏపీలో తిరుగులేని ఆధిపత్యంతో రాజకీయం చేసిన వైసీపీకి ప్రస్తుతం వరుసబెట్టి సమ్మెట…
10 మంది రాజ్యసభ సభ్యులు బయటకి వెళ్లిపోతున్నారు అనే ప్రచారం అవాస్తవమని వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఒకరిద్దరు బయటకి వెళ్లినా మాకు నష్టం లేదన్నారు. మిగిలిన వాళ్లం పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పని చేస్తామన్నారు.
తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని వైసీపీ రాజ్యసభ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. మా రాజ్యసభ సభ్యులు ఇంకెవరూ రాజీనామా చేయడం లేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం ముందు నుంచి తాను జగన్ వెంట ఉన్నానని.. మంత్రి పదవి వుండగానే రాజీనామా చేసి జగన్ వెంట నడిచానని ఆయన పేర్కొన్నారు.