ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఊరట లభించింది. గుంటూరు జిల్లా జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందటంతో నమోదైన కేసులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక, తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
దారుణం.. వన్యప్రాణులపై విషప్రయోగం.. 5 పులులు మృతి కర్ణాటకలో దారుణం జరిగింది. అభయారణ్యంలో వన్యప్రాణుల పట్ల కర్కశంగా ప్రవర్తించారు. విషప్రయోగం ప్రయోగించడంతో ఐదు పులులు మృత్యువాత పడ్డాయి. కర్ణాటకలోని మలేమహదేశ్వర హిల్స్‌లోని హూగ్యం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పులి, దాని నాలుగు పిల్లలు చనిపోయాయని అధికారులు తెలిపారు. ఒకేరోజు ఐదు పులులు చనిపోవడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. అయితే చనిపోయిన పులి కొన్ని రోజుల క్రితం ఒక ఆవును చంపిందని…
YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురిని పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో జరిగిన ప్రమాద ఘటనపై కేసులో నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసును కొట్టివేయాలంటూ జగన్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. బుధవారం లంచ్ మోషన్ పిటిషన్‌గా దాఖలైన ఈ కేసుపై న్యాయమూర్తి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. Read Also:Singam…
YS Jagan: గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి లతోపాటు మరికొందరు చేసిన దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తదుపరి విచారణ గురువారం జరగాల్సిన నేపథ్యంలో దానిని కొన్ని కారణాల వల్ల శుక్రవారంకి వాయిదా వేసింది. సింగయ్య మృతికి సంబంధించిన ఘటనపై న్యాయమూర్తి డా. జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. Read Also:Lover Entry…
గుంటూరు : నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. గుంటూరు రూరల్ మండలం చౌడవరం ఆర్.వి.ఆర్.అండ్ జే.సి. ఇంజనీరింగ్ కాలేజీలో పోలీసు శాఖ ఏఐ హ్యాక్ థాన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెంలో జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరును పరిశీలించనున్న చంద్రబాబు. నేడు విశాఖలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, CS పర్యటన. ఇవాళ సాగర్‌నగర్‌లో EPDCL సూపర్ ఈసీబీసీ భవనం ప్రారంభం. స్కాడా భవనం సందర్శించనున్న మంత్రి గొట్టిపాటి…
వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇటీవల తరచూ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్నారు. రెగ్యులర్‌గా జరుగుతున్న పరామర్శ యాత్రల్లో భద్రతా వైఫల్యాలు బయటపడటం, వాటిని వైసీపీ శ్రేణులు హైలైట్ చేసి చూపడం కామన్ అవుతోంది. గుంటూరు, రాప్తాడు, పొదిలి, సత్తెనపల్లి పర్యటనలన్నీ వివాదాస్పదం అవడంపై ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే కాదు.... మొత్తం ఏపీ పాలిటిక్స్‌లో పరిచయం అక్కరలేని పేరు ధర్మాన ప్రసారావు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేశారాయన. కాంగ్రెస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీల్లో తనదైన మార్క్ రాజకీయాలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రి పదవిలో ఉన్న ధర్మాన... ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. ఏడాదిగా బయట ఎక్కడా కనిపించడం లేదాయన.
సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందంటూ ఎక్స్‌లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని, అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎండీసీ ద్వారా నిన్న కూడా బాండ్లు జారీ చేశారని, రూ.5526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారన్నారు. రానున్న రోజుల్లో మరలా ఏపీఎండీసీ ద్వారా అప్పులు చేయటానికి సిద్దమయ్యారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ డబ్బంతా ఎవరి…
రిషబ్ పంత్‌కు కెరీర్ ఉత్తమ ర్యాంకు! ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పురోగతి సాధించాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పంత్ కెరీర్ ఉత్తమ ర్యాంకు అందుకున్నాడు. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో రెండు సెంచరీలు చేయడంతో ఒక ర్యాంకు మెరుగుపరుచుకుని.. ఏడో స్థానంలో నిలిచాడు. లీడ్స్ టెస్ట్‌లో పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 134, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా వాహనం ఢీకొని చీలి సింగయ్య మృతి చెందిన కేసులో జగన్ రెండో నిందితుడిగా ఉన్నారు. తనపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం హైకోర్టు క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. ఈ కేసులో వైఎస్ జగన్ పిటిషన్‌తో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి…