శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే... అవి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కాదు. అలాంటి పోరు ఉంటే... అది షరా మామూలే. కానీ... ఇక్కడ మాత్రం కాస్త తేడాగా ఉందట. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేంద్రంగా నడుస్తున్న వ్యవహారాలు ఆసక్తికరంగా మారుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్నారు దువ్వాడ.
గుంటూరు జిల్లా జైలు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ విడుదలయ్యారు.. టీడీపీ కార్యకర్త రాజుపై దాడికేసులో సోమవారం రోజు సురేష్కు బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. అయితే, షూరిటీలు సమర్పించడంలో అలస్యం కావడంతో ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు నందిగం సురేష్..
వైఎస్ జగన్ భద్రత వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.. ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేశారు..
పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు జరిగిన యువ విభాగ సమావేశంలో పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు జగన్.. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. ఆ తర్వాత చివర్లో పాదయాత్ర ఉంటుంది.. మీతో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయి అని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్..
నేను రౌడీలతో పోరాటం చేస్తున్నా.. రాష్ట్రంలో వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతుందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనలో.. పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత ప్రజా వేదికపై మాట్లాడుతూ.. .వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతుందన్నారు.. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయ్యింది.. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ఇంటింటికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఏపీ హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ను పోలీసులు విచారించకుండా.. న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు ఏజీ 2 వారాల గడువు కోరగా.. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. దాంతో పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. Also Read: PVN Madhav: బీజేపీని…
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏనాడూ రాజీ పడలేదు అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికష్టాలు వచ్చినా.. వైసీపీలో విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశామన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అని, పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండడం చాలా ముఖ్యం అని, సమస్య వచ్చినప్పుడు ప్రజలకు తోడుగా నిలబడాలని జగన్ సూచించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం…
ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ. సంగారెడ్డి : నేడు సిగాచి పరిశ్రమకి సీఎం రేవంత్ రెడ్డి. పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో పరిశ్రమలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి. అనంతరం ప్రమాద స్థలిని పరిశీలించనున్న సీఎం రేవంత్. నేడు తెలంగాణ గ్రూప్-1 పిటిషన్లపై విచారణ. TGPSC నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై…
ఏపీలో విద్యా వ్యవస్థపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని విమర్శించారు. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదన్నారు.
CM Chandrababu: టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో అభివృద్ధి పేరుతో రాజకీయాలు మర్చిపోయాం.. దీంతో మనపై దుష్ప్రచారం చేశారు.. అందుకే ప్రతి ఇంటికి వెళ్లి ఏమి చేశామో చెప్పాలి అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకు వివరించాలి.. గతంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి.